గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. రొంపిచెర్ల మండలం సుబ్బయ్యపాలెం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తంగేడుమల్లి మేజర్ కాలువలోకి ఓ కారు దూసుకుని వెళ్లింిద. 

ఆ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృత్యువాత పడ్డారు మృతులను ప్రకాశం జిల్లా పామర్రుకు చెందినవారిగా గుర్తించారు. వారు హైదరాబాదు నుంచి ప్రకాశం జిల్లాకు వెళ్తుండగా అద్దంకి - నార్కెట్ పల్లి జాతీయ రహదారిపై ఆ ప్రమాదం జరిగింది. 

ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. వివరాలు అందాల్సి ఉంది.