గుంటూరు: ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరుకు తొలి రాత్రి కాళరాత్రిగా మారింది. సాఫ్ట్ వేర్ ఇంజనీరు అయిన భర్త తొలిరాత్రి ఆమెకు నరకం చూపించాడు. భర్త ప్రవర్తనతో తొలి రాత్రి ఆ యువతి తీవ్రమైన నిరాశకు, వేదనకు గురైంది. 

తనపై భర్త అత్యంత పాశవికంగా ప్రవర్తించాడని, తనను గాయపరిచాడని యువతి సోమవారం గుంటూరు రూరల్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు చేసిన వివరాల ప్రకారం.... ప్రకాశం జిల్లాకు ెచందిన యువకుడు హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. 

నరసారావుపేటకు చెందిన యువతితో అతనికి అక్టోబర్ నెలలో వివాహమైంది. ఆమె కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీరు. తొలి రాత్రి అతని ప్రవర్తనను గమనించి భయపడుతున్నాడని భావించి రోజులు వెల్లదీస్తూ వచ్చారు. 

రెండు రోజుల క్రితం రాత్రి వారిద్దరికి శోభనం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అతను భార్య నైటీ వేసుకుని వింతగా ప్రవర్తించాడు. ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బ్లేడుతో మర్మావయవాలపై, శరీరంపై గాయాలు చేశాడు. యువతి ఆ విషయాన్ని తమ పెద్దలకు చెప్పింది. 

వాళ్లు వరుడి బంధువులను సంప్రదించారు. దీంతో వారు ఎదురు తిరిగి వధువే సంసారానికి పనికి రాడని వివాదానికి దిగారు. దాంతో గాయాలతో ఉన్న ఆమెను తల్లిదండ్రులు ఎస్పీ కార్యాలయానికి తీసుకుని వెళ్లారు. స్పందన అధికారులు వెంటనే నరసరావుపేట పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.