అనుమానానికి.. రెండు నిండు ప్రాణాలు బలి...
గుంటూరులో సోమవారం అర్థరాత్రి వేర్వేరు ఘటనల్లో ఇద్దరు హతులయ్యారు. ఓ ఘటనలో భర్త భార్యను చంపగా, మరో ఘటనలో భార్య భర్తను చంపింది. ఈ రెండు సంఘటనల్లోనూ అనుమానమే హత్యకు కారణంగా తేలింది.
గుంటూరులో సోమవారం అర్థరాత్రి వేర్వేరు ఘటనల్లో ఇద్దరు హతులయ్యారు. ఓ ఘటనలో భర్త భార్యను చంపగా, మరో ఘటనలో భార్య భర్తను చంపింది. ఈ రెండు సంఘటనల్లోనూ అనుమానమే హత్యకు కారణంగా తేలింది.
వివరాల్లోకి వెడితే.. గుంటూరు తుఫాన్‌నగర్‌లో నివాసం ఉండే మాలంపాటి వీరాంజనేయులు కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి 14 సంవత్సరాల క్రితం కృష్ణాజిల్లా కంచికచర్లకు చెందిన కోటేశ్వరి (36)తో వివాహం జరిగింది. వీరికి ఎనిమిదేళ్ల బాబు ఉన్నాడు. కరోనా సమయంలో భార్యాభర్తలు కంచికచర్లలోని కోటేశ్వరి పుట్టింటికి వెళ్లారు.
20 రోజుల తరువాత వీరాంజనేయులు తిరిగి గుంటూరుకు వచ్చేయగా, కరోనా ప్రభావం అధికంగా ఉండటంతో కోటేశ్వరి అక్కడే ఉండిపోయింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు రాగా పెద్ద మనుషుల సమక్షంలో సర్దిచెప్పి కాపురానికి పంపారు. ఈ క్రమంలో వీరాంజనేయులు భార్యపై అనుమానం పెంచుకుని నిత్యం ఆమెతో గొడవ పడుతున్నాడు.
ఈ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో భార్యాభర్తల మధ్య తిరిగి వివాదం చోటుచేసుకుంది. ఈ సమయంలోనే వీరాంజనేయులు కోటేశ్వరి తలను గోడకేసి కొట్టి గొంతు నులిమి హతమార్చాడు. మృతురాలి తల్లి మంగిశెట్టి లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరాంజనేయులును అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
గుంటూరు పట్నం బజారులో జరిగిన రెండో కేసులో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది ఓ భార్య. గుంటూరు అరండల్‌పేట పోలీసులు, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... స్థానిక రాజీవ్‌గాంధీనగర్‌లో నివాసం ఉండే పీకే మరియదాసు (40) మార్బుల్ పని చేస్తాడు. అతనికి 22 ఏళ్ల క్రితం మరియమ్మతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు మిర్చియార్డులో పనిచేస్తున్నాడు.
కొంతకాలంగా తెనాలి మండలం పెరవలి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ అనిల్‌తో మృతుడి భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో నిద్రిస్తున్న మరియదాసును అనిల్, మరియమ్మ కలిసి గొంతుకు తాడు బిగించి, రోకలిబండతో తలపై తీవ్రంగా కొట్టి హతమార్చారు. అనంతరం వారిద్దరూ అక్కడినుంచి పరారయ్యారు.
తెల్లవారుజాము సమయంలో మరియమ్మ తన కుమారుడు సుధాకర్‌కు ఫోన్ చేసి తండ్రి మరియదాసు యాక్సిడెంట్ అయి ఇంట్లో పడి ఉన్నాడని చెప్పింది. సుధాకర్ విషయాన్ని బంధువులకు తెలియజేయగా, వారు పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. అరండల్‌పేట పోలీసుస్టేషన్ ఎస్‌హెచ్‌వో బత్తుల శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతుడి తలపై ఉన్న గాయాలను చూసి అనుమానం వచ్చిన ఎస్‌హెచ్‌వో శ్రీనివాసరావు తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న మరియమ్మ, అనిల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా హత్యకు పాల్పడినట్లు అంగీకరించారు. మృతుడి సోదరుడు కాంతారావు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.