అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి యనమల  రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ప్రగతిభవన్ లో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైయస్ జగన్, కేసీఆర్ ల మధ్య కేంద్రం తీరుపై చర్చ జరిగిందని ఆరోపించారు. 

ఇరు రాష్ట్రాల ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని ముఖ్యమంత్రులు చర్చించుకున్న మాట వాస్తవం కాదా అని నిలదీశారు. కేంద్రం తీరుపై చర్చించి చర్చించలేదంటూ సీఎంవో కార్యాలయం నుంచి ప్రకటనలు ఇస్తారా అంటూ మండిపడ్డారు.

ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అశాలపైనే చర్చిస్తే ఎందుకు మీడియా సమావేశాన్ని నిర్వహించలేదో చెప్పాలని నిలదీశారు. నాలుగు గంటలకు పైగా చర్చించిన ఇరు రాష్ట్రాల సీఎంలు ఏం చర్చించారో ఎందుకు ప్రజలకు బహిర్గతం చేయడం లేదని మాజీమంత్రి యనమల నిలదీశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్, జగన్ భేటీపై వార్తాకథనం: ఎపి సిఎంవో ఫైర్

ప్రగతి భవన్‌లో మూడు గంటలుగా కొనసాగుతున్న కేసీఆర్, జగన్ భేటీ

ప్రగతి భవన్‌లో సమావేశమైన కేసీఆర్, జగన్