అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అమ్మఒడి పథకాన్ని ఎలాంటి లొసుగులు లేకుండా సమర్థవంతంగా అమలుచేయనున్నట్లు విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. అందుకోసం గ్రామ స్థాయిలో ఇటీవలే నియమితులైన గ్రామ వాలంటీర్ల సాయాన్ని విద్యాశాఖ పొందనున్నట్లు మంత్రి వెల్లడించారు. వారి ద్వారానే తమ పిల్లలను బడికి పంపే తల్లిదండ్రులను గుర్తించడం జరుగుతుందని ఆయన ప్రకటించారు. 

ఇప్పటివరకు దాదాపు 45 లక్షల మంది తల్లులను లబ్ధిదారులుగా గుర్తించినట్లు మంత్రి తెలిపారు. రేషన్ కార్డు లేకుంటే ఆదాయ దృవీకరణ సర్టిఫికెట్లు సమర్పిస్తే అమ్మ ఒడి పథకంకానికి అర్హులవుతారని వెల్లడించారు. 

నాణ్యతా ప్రమాణాలు పాటించని ఇంజనీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. అలాంటి  కాలేజీలు ఇకనైనా తమ తీరును మార్చుకోవాలని...లేదంటే త్వరలో వేటుకు సిద్దంగా వుండాలని మంత్రి హెచ్చరించారు.

read more నిరుద్యోగులకు శుభవార్త: ఆర్‌అండ్‌బీలో ఉద్యోగాల భర్తీకి సీఎం ఆదేశం

ఇక ఇసుకపై జరుగుతున్న వివాదంపై కూడా మంత్రి సురేశ్ స్పందించారు. ఇసుక  కొరతను తీర్చడంలో పూర్తిగా వైఫల్యమయ్యామని ప్రతిపక్షాలు యాగీ చేయడం సమంజసం కాదన్నారు. పవన్ కళ్యాణ్ టిడిపితో కుమ్మక్కయ్యాడని ప్రజలకు తెలుసని...ఆదివారం జరిగిన లాంగ్ మార్చ్ తో తేటతెల్లమైందన్నారు.

ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయిన పవన్ కల్యాణ్ చేసింది లాంగ్ మార్చో... కారు మార్చో.. తెలీక చాలామంది ఇంకా కన్ప్యూజన్ లోనే వున్నారని ఎద్దేవా చేశారు. జిల్లాల వారిగా 35 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అవరమన్న అధికారిక లెక్కల ఆధారంగా ప్రణాళికా బద్దంగా ఇసుకను అందిచడానికి సిద్దమైనట్లు మంత్రి తెలిపారు.

ఈ ఏడాదిలలో ఏకంగా ఆరు సార్లు వరదలు వచ్చాయని గుర్తుచేశారు. ఎన్నడూ నీటిమునకకు గురవని ప్రాంతాలను సైతం వరదలు ముంచెత్తాయి. అందువల్లే ఇసుక తవ్వకాలు ఆగిపోయి కాస్త సమస్యలు ఎదుయ్యాయని అన్నారు.

read more  ఇసుక తాత్కాలిక సమస్య మాత్రమే...ఈ నెలమొత్తం ఇలాగే...: సీఎం జగన్

రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ లో ఇసుక దొరుకుతోందన్న ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవమన్నారు. ఇసుక పాలసీలో ట్రాన్స్ పోర్టు భారాన్ని తగ్గించడం, ఇతర సమస్యలను ఇప్పటికే ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. 

డీసిస్టేషన్ పాయింట్లు గుర్తిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఈ ఐదునెలల తమ పాలన నచ్చి మాజీ మంత్రులు సైతం వైఎస్సార్‌సిపి చేరడానికి ముందుకు వస్తున్నట్లు మంత్రి  సురేశ్ పేర్కొన్నారు.