పులివెందుల, అమరావతిలో ఒకేలా...నాలుగంచెల తనిఖీ విధానం: జగన్ ఆదేశాలు
మధ్యాహ్న భోజన పథకంపై పాఠశాల విద్యాశాఖ అధికారులతో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సలహాలు, సూచనలిచ్చారు.
మధ్యాహ్న భోజన పథకం మెనూలో నాణ్యత అన్ని చోట్లా ఒకే విధంగా ఉండాలి సీఎం ఎక్కడ తిన్నా టేస్ట్ ఒకేలా ఉండాలని సీఎం వైఎస్ జగన్ విద్యాశాఖ అదికారులను ఆదేశించారు. పులివెందులలో తిన్నా అమరావతిలో తిన్నా రుచి మారకూడదని సూచించారు. ఆయాలకిచ్చే రూ.3000 వేతనం మొదలుకుని సరుకుల నగదు చెల్లింపుల వరకు గ్రీన్ ఛానెల్‌లో పేమెంట్స్ ఉండాలని... మధ్యాహ్న భోజనం తనిఖీకి కోసం నాలుగంచల విధానం అమలుచేయాలని సీఎం ఆదేశించారు.
మధ్యాహ్న భోజన పథకంపై పాఠశాల విద్యాశాఖ అధికారులతో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం పలు సలహాలు, సూచనలిచ్చారు.
విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత తనిఖీ చేసి ఫీడ్ బ్యాక్ ఇచ్చేందుకు పాఠశాల స్ధాయిలో పేరెంట్స్ కమిటీలో ముగ్గురు తల్లులను నియమించాలని సూచించారు.
పాఠశాల ప్రదానోపాధ్యాయుడుకి కూడా కమిటీలో చోటు కల్పించాలన్నారు. పేరెంట్స్ కమిటీ కూడా పిల్లలతో కలిసి భోజనం చేసి నాణ్యత పరిశీలించాలని... ఈ కమిటీలు నాడు–నేడు, పారిశుద్ద్యం కూడా పరిశీలిస్తారని తెలిపారు.
రెండో దశలో గ్రామ సచివాలయాల నుంచి తనిఖీ, మూడో స్ధాయిలో ఎస్‌హెచ్‌జి గ్రూపుల నుంచి తనిఖీ నిర్వహిస్తారని తెలిపారు. నాలుగో స్ధాయిలో సెర్ఫ్ లేదా మరో సంస్ధకు ఈ తనిఖీ బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. తనిఖీ మానిటరింగ్ బాధ్యతలు ఆర్డీఓకు అప్పగించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. క్వాలిటీ, పుడ్ సేప్టీ కూడా చూడాలని ఆదేశించారు.
నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం కోసం ఏడాదికి రూ.1300 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సీఎం వెల్లడించారు. ఇది ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమమని... మిడ్ డే మీల్ కోసం మొబైల్ యాప్ రూపకల్పన చేస్తున్నామని సీఎంకు అధికారులు వివరించారు. ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ యాప్ పనిచేస్తుందని... ఇది ప్రస్తుతం మెనూ పరిశీలన కోసం ఉపయోగిస్తామని వివరించారు. ఆహార నాణ్యత తనిఖీ కోసం ఉపయోగించే ఆలోచన చేస్తున్నామన్నారు అధికారులు.
కాలకేయుడిలా జగన్... సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ఆశ్చర్యపోయేలా...: వర్ల రామయ్య
నాణ్యతో కూడిన మధ్యాహ్న భోజన కార్యక్రమం ఈనెల 21న ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. డివిజనల్ స్ధాయిలో గుడ్లు సరఫరా టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. ఇందులో కూడా రివర్స్ టెండరింగ్‌కు వెళ్తామని అధికారులు తెలపగా ఇందులో పౌల్ట్రీ ఫారం యజమానులు ఎవరైనా పాల్గొనేలా నిబంధనలు ఉండాలని సీఎం సూచించారు. నేరుగా పౌల్ట్రీ యజమానులే టెండరింగ్‌లో పాల్గొంటే ధర రీజనబుల్‌గా ఉంటుందన్నారు.
వేరుశనగ–బెల్లం చిక్కీల సరఫరాకు సంబంధించి స్వయం సహాయక సంఘాల సహాయం తీసుకోవాలని జగన్ సూచించారు. క్వాలిటీ సరిగా ఉండేలా చూసుకోవాలని.. చిక్కీల తయారీలో తగిన శిక్షణ ఇవ్వాలన్నారు.
అమ్మఒడి విద్యాశాఖలో అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమని ఆ తర్వాత ఇంగ్లీషు మీడియం, నాడు–నేడు కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పిల్లలను బడికి పంపిస్తే మేలు జరుగుతుందన్న భరోసా ప్రజల్లో కల్పించిన కార్యక్రమం ఆమ్మఒడి అని ప్రశంసించారు. ఇంగ్లిషు మీడియం పై సెల్ఫ్ ఎసెస్‌మెంట్ యాప్‌ను వర్కవుట్ చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. వారంలో రోజుల్లో దీనికి తుదిరూపు వస్తుందన్నారు.
ఈనెల 21న జరిగే సమావేశంలో మిడ్ డే మీల్‌తో పాటు పాఠశాల శానిటేషన్ నిర్వహణ గురించి కూడా చెప్పాలని... పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకునే బాధ్యత కమిటీలకు కూడా ఉందన్నారు. మీ పిల్లలు చదివే స్కూల్స్ నీట్‌గా ఉండాలన్నారు.
జగన్ పాలనపై వైసిపి మంత్రి విమర్శలు...: వీడియోను ప్రదర్శించిన దేవినేని ఉమ
ఇప్పటివరకు అమ్మఒడి పథకం కింద ఎంపికైన లబ్ధిదారులు 42,32,098 మంది అని... వారిలో ఇంతవరకు నగదు బదిలీ అయిన తల్లుల సంఖ్య 40,19,323 అని అధికారులు సీఎంకు తెలిపారు. వీరిలో ఒక్కోక్కరికి రూ.15000 చొప్పున మొత్తంగా రూ. 6028.98 కోట్లు పంపిణీ చేశామన్నారు. ఇంకా పరిశీలనలో లబ్దిదారులు 2,12,775మంది వున్నట్లు తెలిపారు.
నాడు–నేడు కార్యక్రమం చాలా ముఖ్యమైనదని... రివాల్వింగ్ ఫండ్ వెంటనే రిలీజ్ చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. నాడు–నేడు కింద స్కూళ్లలో పెయింటింగ్ డిజైన్స్ పై ఆరా తీశారు సీఎం. దీనికోసం రెండు, మూడు డిజైన్లు రెడీ చేస్తున్నామని అధికారులు తెలిపారు. సెంట్రలైజ్డ్ ప్రోక్యూర్‌మెంట్ కింద ఫర్నిచర్, పెయింట్స్, బాత్రూం ఫిట్టింగ్స్, ఫ్యాన్లు కొనుగోలు చేయాలని ఆదేశించారు. పెయింటింగ్స్‌కు సంబంధించి డిజైన్ రెండు మూడు రోజుల్లో ఖరారు చేయాలని అధికారులు జగన్ ఆదేశించారు.