Asianet News TeluguAsianet News Telugu

దివ్యాంగుడి పట్ల ముఖ్యమంత్రి జగన్ ఉదారత... భారీ ఆర్థికసాయం

ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు అతడు మంత్రుల చేతులమీదుగా భారీ ఆర్థిక సాయాన్ని అందుకున్నారు.  

CM YS Jagan Help A Handicapped Person
Author
Amaravathi, First Published Nov 27, 2019, 7:44 PM IST

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం గోగుతిప్ప గ్రామానికి చెందిన దివ్యాంగుడు సాయిబాబుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉదారత ప్రదర్శించారు. 
రెండు కాళ్ళు, చేతులు లేకుండా నిస్సహాయ స్థితిలో వున్న ఆ యువకుడికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. దీంతో అతడు ఇతరులపై ఆధారపడకుండా స్వతహాగా ఆత్మగౌరవంతో బ్రతికే ఏర్పాటు చేశారు. 

CM YS Jagan Help A Handicapped Person

ఈ సందర్భంగా సాయిబాబు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామితో కలిసి వెలగపూడి సచివాలయానికి వచ్చారు. ఈ క్రమంలో నాల్గవ బ్లాక్ లో ఉన్న ప్రచార విభాగంలో కేబినెట్ నిర్ణయాలను వెల్లడిస్తున్న రవాణా మరియు సమాచార, పౌర సంబంధాల  శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)ను వారు కలిశారు. 

read more  మరీ ఇంతలా కట్టడి చేస్తారా, చెప్పుకోలేకపోతున్నాం: జగన్ వద్ద ముగ్గురు మంత్రుల ఆవేదన

అడిగిన వెంటనే  తనకు రూ.5 లక్షల సాయం మంజూరు చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మీడియా ముఖంగా కృతజ్ఞతలు చెప్పాలనుకున్నానని సాయిబాబు మంత్రికి వివరించారు. ఈ మేరకు మంత్రులు ఇరువురూ కలిసి సాయిబాబకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేశారు. 

CM YS Jagan Help A Handicapped Person

సీఎం వైఎస్ జగన్ పేదలకు, అభాగ్యులకు అండగా నిలుస్తారనడానికి ఈ ఘటనే నిదర్శనమని మంత్రులు పేర్కొన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ లక్ష రూపాయలు అడిగితే రూ.5లక్షలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని యువకుడు సాయిబాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

read more  కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు ఏపి కేబినెట్ శుభవార్త... భారీగా వేతనాల పెంపు

గొప్ప మానవతావాది సీఎంగా లభించడం పేదల అదృష్టమని ప్రశంసించారు. ఆయన మంత్రివర్గంలో పనిచేయడం చాలా గర్వంగా ఫీలవుతున్నట్లు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్యలు తెలిపారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios