అమరావతి: సినీ నటుడు చిరంజీవి గన్నవరం విమానాశ్రయం చేరుకొన్నారు. సైరా సినిమా తిలకించాలని ఏపీ సీఎం జగన్ ను ఆహ్వానించేందుకు చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి సోమవారం నాడు విజయవాడకు వచ్చారు. మరికాసేపట్లో జగన్ తో వీరిద్దరూ భేటీ కానున్నారు.

చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ప్రస్తుతం రాష్ట్రంలో రికార్డులు సృష్టిస్తోంది. స్వాతంత్ర్య పోరాటంలో సైరా నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా  ఈ సినిమాను రూపొందించారు.

ఈ సినిమాను తిలకించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ను నటుడు,మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి ఆహ్వానించనున్నారు.ఇందులో భాగంగానే చిరంజీవి సీఎం జగన్ తో భేటీ కానున్నారు. మధ్యాహ్నం సీఎం జగన్ తో కలిసి చిరంజీవి లంచ్ మీటింగ్‌లో పాల్గొంటారు. సైరా సినిమాను చూడాలని  జగన్ ను చిరంజీవి ఆహ్వానిస్తారు.

వీరిద్దరి భేటీకి రాజకీయంగా కూడ ప్రాధాన్యత ఏర్పడింది అయితే ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత లేదని చిరంజీవి సన్నిహితులు ప్రకటించారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుండి  చిరంజీవి, రామ్‌చరణ్‌లు రోడ్డు మార్గం ద్వారా  అమరావతికి చేరుకొంటారు.