అమరావతి: గుంటూరు జిల్లాలో పట్టపగలే భారీ  దొంగతనం చోటుచేసుకుంది. సినీ పక్కీలో ఏటిఎంలో నగదును నింపే వాహనంలో నుండి దాదాపు 36లక్షలను అత్యంత చాకచక్యంగా దోపిడీ చేశారు దుండగులు. ఈ చోరీ జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. 

ఈ దోపిడీకి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు పట్టణ సమీపంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పక్కన గల ఏటిఎంలో నగదు నిల్వ చేయడానికి వచ్చిన వాహనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వ్యాన్లో ఉన్న నలుగురు సిబ్బంది ఏటిఎం లోకి వెళ్లటంతో అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన దొంగలు వాహనంలోని డబ్బును తీసుకుని పరారయ్యారు. వారు దొంగిలించిన నగదు దాదాపు  36లక్షలు వుంటుందని సమాచారం. 

read more  విజయవాడ గ్యాంగ్‌వార్: పనిచేయని పండూ చేతివేలు, న్యూరో జర్జరీ విభాగంలో పరీక్షలు

ఈ దోపిడీపై వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి దొంగలను పట్టుకోవాలని నల్లపాడు పోలీసులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దోపిడీకి పాల్పడిన  దుండగులు వ్యాన్లో ఉన్న నలుగురు సిబ్బందిలో ఎవరో ఒకరికి సంబందించిన వ్యక్తులు అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.