ఏపీలోకి వలసకూలీలకు నో పర్మిషన్: వాడపల్లి వద్ద ఆందోళన

ఆంధ్రప్రదేశ్ కు చెందిన వంద మంది వలస కూలీలు వాడపల్లి వద్ద తమ స్వస్థలాలకు చేరుకోవడానికి వేచి చూస్తున్నారు. హైదరాబాదు నుంచి వచ్చిన వారిని ఏపీలోకి పోలీసులు అడుగు పెట్టనీయడం లేదు.

AP police rejects permission to migrant labour to enter into the state

గుంటూరు: రాష్ట్రంలోకి ప్రవేశించడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వలస కూలీలను అనుమతించడం లేదు. దీంతో వలస కూలీలు ఆందోళనకు దిగారు. హైదరాబాదు నుంచి దాదాపు వంద వలస కూలీలు ఆంధ్రప్రదేశ్ లోని తమ స్వస్థలాలకు చేరుకోవడానికి నల్లగొండ జిల్లాలోని వాడపల్లికి చేరుకున్నారు.  

వాడపల్లి వద్ద ఆంధ్రప్రదేశ్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు ఆందోళనకు దిగారు. కేంద్రం స్వస్థలాలకు వెళ్లడానికి అనుమతి ఇచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమను అడ్డుకోవడాన్ని వారు నిరసించారు. అయితే, ఉన్నతాధికారుల అనుమతి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారికి కళ్లెం పడడం లేదు. గత 24 గంటల్లో కొత్తగా 62 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,525కు చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ వల్ల 33 మంది మరణించారు.   

గత 24 గంటల్లో 5943 పరీక్షలు నిర్వహించగా కొత్తగా 62 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. ఇప్పటి వరకు 441 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 1051 ఉంది. శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.

కర్నూలు జిల్లా కరోనా వైరస్ తో అట్టుడుకుతూనే ఉంది. కర్నూలు జిల్లాలో గత 24 గంటల్లో కొత్తగా 25 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కృష్ణా జిల్లాలో 12 మందికి కరోనా ఉన్నట్లు తేలింది. గుంటూరు జిల్లాకు కొంత ఊరట లభించింది. గత 24 గంటల్లో 2 కరోనా కేసులు మాత్రమే బయటపడ్డాయి. 

గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలో 4, తూర్పు గోదావరి జిల్లాలో 3, కడప జిల్లాలో 4, నెల్లూరు జిల్లాలో 6, ప్రకాశం జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. విశాఖపట్నం జిల్లాలో 4 కేసులు బయటపడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 1 కేసు నమోదైంది. విజయనగరం జిల్లా ఇప్పటికీ కరోనా ఫ్రీగానే ఉంది. కర్నూలు జిల్లా 436 కేసులతో ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, గుంటూరు జిల్లా 308 కేసులతో రెండో స్థానంలో ఉంది. 

జిల్లాలవారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది...

అనంతపురం 71
చిత్తూరు 80
తూర్పు గోదావరి 45
గుంటూరు 308
కడప 83
కృష్ణా 258
కర్నూలు 436
నెల్లూరు 90
ప్రకాశం 61
శ్రీకాకుళం 5
విశాఖపట్నం 29
పశ్చిమ గోదావరి 59

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios