అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాసిక్యూషన్ శాఖ పరిధిలో 50 సహాయ పబ్లిక్ ప్రోసెక్యూటర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. నియామకాలకు ఏపి రిక్రూట్మెంట్ బోర్డ్ చేపట్టనుంది. ఈ మేరకు భర్తీకి సంబంధించిన విధివిధానలతో నోటిఫికేషన్ కొద్దిసేపటిక్రితమే విడుదలయ్యింది. 

ఈ నియామక ప్రక్రియపై రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్ అమిత్ గర్గ్ గురువారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాసిక్యూషన్ శాఖ సెప్టెంబర్ 30 న విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఆన్లైన్ లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు.

30.9.2019 నుండి 31.10.2019 సాయంత్రం 5 గంటల  వరకు  www.slprb.ap. gov.in వెబ్ సైట్ లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్ 17 వ తేదీ (ఆదివారం) రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. 

నవంబర్ 17వ తేదీన ఉదయం మొదటి పేపర్  10 నుంచి మ.1 వరకు, రెండవ పేపర్ మద్యాహ్నం 2.30 నుంచి సా.5.30 వరకు నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు వ్రాత పరీక్ష కు సంబంధించిన హాల్ టికెట్స్  ను ఇదే వెబ్  సైట్ నుండి  దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అయితే ఈ వ్రాత పరీక్షకు కేవలం ఏడు రోజుల ముందు అధికారిక వెబ్సైట్ నుండి వీటిపి డౌన్లోడ్ చేసుకునే వీలుంటుందని ఆయన తెలిపారు.