అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలను సకాలంలో నిర్వహించేలా సంసిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ యస్. రమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. 
ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు స్థానిక సంస్థల ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో చేపడుతున్న పనులపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. పదో తరగతి , ఇంటర్ పరీక్షలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ముందస్తు ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. 

శుక్రవారం 13 జిల్లాల కలెక్టర్లు , ఎస్పీలు , ఇతర ఉన్నతాధికారులతో  ఆయన విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం నుండి వీడియోకాన్పరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతంలో నిర్వహించబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు తగిన ప్రణాళికలతో సంసిద్ధంగా ఉండాలని సూచించారు. 

read more  రాజధాని కోసం... మరో అమరావతి రైతు మృతి

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిబంధనలను, మార్గదర్శకాలను తూచా తప్పకుండా అమలు చేయడంలో జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ ఎన్నికలను పూర్తి స్వేచ్చగా , ఖచ్చితత్వంతో, పారదర్శకంగా నిర్వహించే దిశలో కలెక్టర్లు క్షేత్రస్థాయిలో చేపడుతున్న చర్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. 

ఎన్నికల నిర్వాహణకు సంబంధించి ముఖ్యంగా 7 అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని ఆయన సూచించారు.  ఓటర్ల జాబితాను అప్ డేట్ చేసి ముద్రించాలన్నారు. బ్యాలెట్ బాక్స్ లను  ముందుగానే సరిచూసుకోవాలని సూచించారు. ఆర్ఓలు, ఏఆర్‌ఓలు,  మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని ఇఓలు, ఏఇఓలు పురపాలక సంఘాలు మరియు నగర పంచాయతీల పరిధి లో ఎన్నికల సిబ్బందిగా నియమించాలన్నారు.

read more  రాయిటర్స్ సొంత పైత్యమే...: కియా మోటార్స్ తరలింపుపై బొత్స

మైక్రో అబ్జర్వర్ లను  గుర్తించడం చాలా ముఖ్యమని అన్నారు.ఎన్నికల సామాగ్రి అయిన ఫార్మ్స్ , కవర్లు , హ్యాండ్ బుక్స్ , ఇతర మెటీరియల్‌ను సిద్ధం చేసుకోవడం, బ్యాలెట్ పేపర్ల ముద్రణ లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణ ప్రక్రియలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుండి ఓట్ల లెక్కింపు వరకు ప్రస్తుతం ఉన్న కాలవ్యవధి 27 రోజులను 20 రోజులకు తగ్గించడం జరుగుతోందన్నారు.  ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగినప్పుడు యంసిసి అమల్లో ఉంటుందన్నారు. చట్టపరమైన ఇబ్బందులకు అవకాశం లేకుండా మార్గదర్శకాలను ఖచ్చితత్వంతో కూడి అమలు చేయాలని రమేష్ కుమార్ స్పష్టం చేసారు.