బురద, నిందలు ఇప్పటిది కాదు.. అలవాటైపోయింది: జగన్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో పెన్షన్ల తొలగింపు, కియా మోటార్స్ తరలింపుపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కియా తరలిపోతుందంటూ తప్పుడు వార్త ఇచ్చి, అనైతికమైన రిపోర్టింగ్ చేశారని జగన్ మండిపడ్దారు.
రాష్ట్రంలో పెన్షన్ల తొలగింపు, కియా మోటార్స్ తరలింపుపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కియా తరలిపోతుందంటూ తప్పుడు వార్త ఇచ్చి, అనైతికమైన రిపోర్టింగ్ చేశారని జగన్ మండిపడ్దారు.
వాస్తవాలను నిర్థారించుకోకుండా వార్తా కథనం ఇచ్చారని, ఉద్దేశ్యపూర్వకంగానే ఇదే ప్రచురించారని సీఎం ఆరోపించారు. తాము అనంతపురం నుంచి ఎక్కడికి వెళ్లడం లేదని కియా సంస్థ వరుసగా స్పందిస్తున్నా... వాస్తవాలను పట్టించుకోవడం లేదంటూ ముఖ్యమంత్రి ఫైరయ్యారు.
Also Read:కియా ఎక్కడికీ పోదు, మేనేజ్ చేస్తున్నారు: జాతీయ మీడియాతో వైఎస్ జగన్
రాజకీయాల కోసం వ్యవస్థలను మేనేజ్‌చేసి ఏ స్థాయికైనా దిగజారే పరిస్థితి చూస్తున్నామని పరోక్షంగా చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. తనపై బురదజల్లడం, నిందలు వేయడం ఇప్పుడే జరుగుతుంది కాదని.. ఇవన్నీ తనకు అలవాటేనని జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొనుగోలు చేశారని.. అయితే ఎన్నికల తర్వాత వారికి వచ్చింది 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలేనన్నారు. ఇది దేవుడు రాసిన గొప్ప స్క్రిప్ట్ అని జగన్ సెటైర్లు వేశారు.
పెన్షన్ ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వకపోతే, అన్యాయం జరిగిందనే భావన వారికి ఉంటుందని జగన్ అభిప్రాయపడ్డారు. వైసీపీకి ఓటు వేయని వారికి కూడా పెన్షన్లు ఇవ్వమని చెప్పామని, ప్రజల ముందే లబ్ధిదారుల జాబితా పెట్టామని సీఎం గుర్తుచేశారు.
Also Read:చంద్రబాబు కోటరీ: వారికి చుక్కలు చూపిస్తున్న జగన్ సర్కార్
సామాజిక తనిఖీ కోసం గ్రామ ప్రజల ముందే, గ్రామ సచివాలయంలో పెడుతున్నామని, ఎవరు తప్పు చేసే అవకాశం లేకుండా చేస్తున్నామని జగన్ తెలిపారు. అర్హులన్నవారికి ఎవ్వరికీ కూడా పెన్షన్ ఇవ్వకూడని పరిస్థితి ఉండకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే వారికి 5 రోజుల్లోగా కార్డులు ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. ప్రతి పథకంకూడా సంతృప్తస్థాయిలో, పారదర్శకంగా అమలు చేస్తున్నామని.. ఇంతకుముందు పెన్షన్ రావాలంటే మూడు నెలల పెన్షన్ సొమ్ము లంచంగా ఇవ్వాల్సి వచ్చేదని జగన్మోహన్ రెడ్డి గుర్తుచేశారు.