అమరావతి:  హైదరాబాద్‌లో అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోయల్‌ రిఫ్‌మాన్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌తో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన సీఎంని తొలిసారి కలుసుకున్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి అమెరికా పర్యటన సమయంలో రిఫ్‌మాన్‌  జగన్‌తో సమావేశమయ్యారు. 

గ్రామ సచివాలయాలతోపాటు, పరిపాలనలో తీసుకొస్తున్న సంస్కరణలను  రిఫ్‌మాన్ కు ముఖ్యమంత్రి వివరించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి కూడా తెలియజేశారు. 

అవినీతి రహిత, పారదర్శక, సుపరిపాలనలో భాగంగా తీసుకొచ్చిన విధానాల గురించి వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని... ఆ మేరకు విదేశీ పెట్టుబడిదారులకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. అందువల్ల తమ దేశం నుండి పెట్టుబడులు వచ్చేలా చేడాలని రిఫ్‌మాన్ కు ముఖ్యమంత్రి విజ్ఞప్తిచేశారు. 

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పాలనా సంస్కరణల గురించి విన్న రిఫ్‌మాన్‌ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. అమెరికా నుండి ఈ ప్రభుత్వానికి అన్నిరకాలుగా సహకారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.