ఆటోలకు జగన్ స్టిక్కర్‌లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసులను పార్టీ కార్యకర్తల్లా వాడుతున్నారని విమర్శించారు.

బాబుకు మీకు తేడా ఏముంది జగన్ ? కేంద్ర పథకాలకు చంద్రబాబు స్టిక్కర్ వేశారని..మీరు అంతకు మించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు.. మీ పార్టీ రంగులేసి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని. మీకు ఓటు వేసిన పాపానికి కార్మికులను రోడ్డున పడేశారు’’ అంటూ కన్నా ట్వీట్ చేశారు.

కాగా విజయవాడలో థ్యాంక్యూ సీఎం జగన్మోహన్ రెడ్డి అనే స్టిక్కర్లను పోలీసులే స్వయంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు అందజేయడం దుమారాన్ని రేపింది.