వైసిపి వైపు వంశీ, అవినాశ్ లు... బిజెపి నేత షాకింగ్ కామెంట్స్

టిడిపి నాయకులు వైసిపిలో చేరడంపై బిజెపి నాయకులు సంచలన కామెంట్స్ చేశారు. అలాగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై కూడా బిజెపి నాయకులు ప్రశ్నల వర్షం కురిపించారు.  

ap bjp leaders reacts on tdp leaders joining in ysrcp party

విజయవాడ: దేశంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి, బిజెపి నాయకులు రావెల కిషోర్ బాబు అన్నారు. అవినీతికి మారుపేరైన కాంగ్రెస్ ఇలాంటి విమర్శలు చేయడం విడ్డూరంగా వుందని...వారి అబద్దపు ప్రచారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఒక గుణపాఠం కావాలన్నారు. భారత దేశం అంటే అవినీతి, కుంభకోణాల దేశమనే అపప్రదను కాంగ్రెస్ పాలనలో వుండేదని...అది ఇప్పుడు పూర్తిగా మారిపోయిందన్నారు.

2018 డిసెంబరు14వ తేదీన సుప్రీం కోర్టు రాఫెల్ వ్యవహారంపై విచారణ అవసరం లేదని తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రజా సంపదను దోచుకుని స్విస్  బ్యాంకులలో దాచుకోవడం కాంగ్రెస్ నాయకులకే అలవాటని ఎద్దేవా చేశారు. ఈ తీర్పు మోడీ నీతివంతమైన పాలనకు నిదర్శనమని... ఆయన అవినీతి రహిత పాలన చూసి ప్రపంచ దేశాలే మెచ్చుకుంటున్నాయని  పేర్కొన్నారు. 

గతంలో వాజ్ పేయ్, నేడు మోడీలు సమర్ధవంతంగా పాలన అందించారని కొనియాడారు. అపరిపక్వత కలిగిన నాయకుడు రాహుల్ గాంధీ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చౌకీదార్ చోర్ అని వ్యాఖ్యానించడం సరికాదని కోర్టు మొట్టికాయలు వేసిందని... కాబట్టి ఆయన తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పాలన్నారు.  

read more రాష్ట్ర విభజన కంటే జగన్ పాలనవల్లే నష్టం...: టిడిపి ఎంపీలు

బిజెపి జాతీయ మైనారిటీ మోర్చా కార్యదర్శి షేక్ బాజి మాట్లాడుతూ...  కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి వెళ్లిన జగన్ ఇప్పుడు జాతీయ ప్రాజెక్టుగా ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారన్నారని ప్రశ్నించారు. అసలు జగన్, కేసిఆర్ ల మధ్య ఏ అంశాలపై చర్చలు జరుగుతున్నాయో ఎవరికీ తెలియడంలేదన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో కుటుంబ పార్టీలు రాజ్యమేలుతున్నాయని..డబ్బులే ప్రధాన ఆదాయ వనరులుగా చేసుకుని దోచుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇప్పుడు నీతులు చెబుతున్నారు కానీ ఆయన అధికారంలో ఉన్నపుడు ఏం‌ చేశారని ప్రశ్నించారు. 

ప్రాణం ఉన్నంత వరకు పార్టీ మారను అని అన్నవాళ్లు, తిండి తినేవాడు ఎవరూ వైసిపి పార్టీలోకి వెళ్లరు అన్నవాళ్లంతా ఇప్పుడు అదే పార్టీలు చేరుతున్నారని గుర్తుచేశారు. వారు నాయకులనే విషయం మరచి రౌడీల భాష వాడిన విధానం హేయంగా వుందన్నారు. 

read more  పార్టీ మారుతూ అధినేతను ఏదో ఒకటి అంటున్నారు: వంశీపై జేసీ ఫైర్

రెండు రాష్ట్రాలలో ఆనకట్టలు అడ్డంపెట్టుకుని కూడా సొమ్ములు‌ చేసుకుంటున్నారని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేవలం పార్టీ నేతల మాదిరిగానే వ్యవహరించడం తగదని... తమ మధ్య జరిగే చర్చలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వారిద్దరిపై వుందని షేక్ బాజి పేర్కొన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios