Asianet News TeluguAsianet News Telugu

బిజెపి పొత్తు వారితోనే... టిడిపి ఎంతో మిగతా పార్టీలు అంతే...: కన్నా

ఏపిలో జరగనున్న స్థానిక  సంస్థల ఎన్నికల కోసం బిజెపి సన్నద్దమవుతోంది. ఈ మేరకు జరిగిన సన్నాహక సమావేశంలో  పార్టీ ఏ పార్టీతో కలిసి ముందుకువెళితే బావుంటుంది అన్నదానిపై చర్చించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. 

AP BJP Chief Kanna Lakshminarayana Comments On Alliances
Author
Guntur, First Published Feb 17, 2020, 9:36 PM IST

విజయవాడ: స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బిజెపి, జనసేన కలిసి పోటీ చేస్తాయని ఏపి బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన బిజెపి స్ధానిక సంస్ధల ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

రాష్ట్రమంతా వివిధ దశల్లో జరిగే ఎన్నికల్లో పోటీకి బిజెపి శ్రేణులను సిద్ధం చేస్తున్నామని కన్నా తెలిపారు. బిజెపి, జనసేన కలిసి ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది త్వరలోనే ప్రకటన చేస్తామన్నారు. 

ముఖ్యమంత్రి జగన్ చెప్పేదొకటి... చేస్తున్నది మరొకటి అని అన్నారు. వైసిపి ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీ చేస్తున్నా జగన్ కు కనబడడం లేదా అని కన్నా ప్రశ్నించారు. వైసిపి ఇసుక దందాను అడ్డుకుంటున్న బిజెపి నేతలపై దాడులకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

read more  దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమనే వాళ్లే వాళ్లంతా...: అచ్చెన్నాయుడు

డిజిపిని కలిసి నేరుగా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.ఇసుక దందా రాష్ట్రంలో యధేచ్ఛగా జరుగుతుందని ఆరోపించారు. స్ధానిక సంస్ధల్లో గెలిచేందుకు  వైసిపి క్షేత్రస్థాయి నాయకులతో  అక్రమాలు చేయిస్తుందని అన్నారు. ఇలా సంపాదించిన అక్రమ ధనాన్ని ఎన్నికల్లో ఖర్చుచేసి అడ్డదారుల్లో గెలవాలని చూస్తోందని ఆరోపించారు. 

ఫిబ్రవరి 19వ తేధీన కడపలో పోలీసుల అక్రమ కేసులకు నిరసనగా ధర్నా చేపట్టాలని నిర్ణయించామని కన్నా తెలిపారు. గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడి అడ్రస్ లేకుండా పోయిందన్నారు. జగన్  ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 8 నెలల పాలనలో ఎవరు ప్రశాంతంగా ఉన్నారో చెప్పాలని... కార్పోరేట్ కంపనీలు తప్పించి అని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి మారితే రాజధానిని తరలిస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. అలాగే హైకోర్టు కర్నూలులోనే ఉండాలని కేంద్రానికి లేఖ కూడా వ్రాశామన్నారు.ఆ విషయం చేతకాని ముఖ్యమంత్రికి చెబుతూనే ఉన్నామన్నారు. 

read more  చంద్రబాబు కుటుంబంపై దుష్ప్రచారం...సాక్షిని వదిలేదే లేదు...: యనమల

పోలవరంలో అవినీతి, విశాఖ లొ కుంభకోణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా స్పందన లేదన్నారు. అవినీతిపరులపై కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని కన్నా డిమాండ్ చేశారు. అవినీతిని చూపించి రాజధానిని తరలిస్తున్నామంటే కరెక్ట్ కాదన్నారు. టిడిపి,వైసిపికి సమదూరంలో బిజెపి ఉంటుందని...అదే మా స్టాంఢ్ అని కన్నా స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios