Asianet News TeluguAsianet News Telugu

ఏపి ప్రభుత్వ కీలక నిర్ణయం... ఐటీ కార్యదర్శి అనూప్ సింగ్ బదిలీ

ఏపి ప్రభుత్వంలో కీలక పదవిని చేపడుతున్న అనూఫ్ సింగ్ పై బదిలీవేటు పడింది.  

another IAS officer  transferred... given new posting
Author
Amaravathi, First Published Oct 15, 2019, 5:00 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో మరో కీలక అధికారి బదిలీ అయ్యారు. ఐటీ, ఈ &సి ప్రత్యేక కార్యదర్శి అనూప్ సింగ్ ను  ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (హెచ్‌ఓఎఫ్ఎఫ్)గా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ  చేశారు. 

ఏపి ప్రభుత్వం కొద్దిరోజుల క్రితమే పలువురు ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల బదీలలను చేపట్టింది. ఈ బదీలీల్లో భాగంగా కొంతమందికి పోస్టింగ్ ఖరారు చేయగా మరికొందరికి సంబంధిత కార్యాలయాల్లో రిపోర్ట్ చేయాల్సిందిగా సూచించారు.  

జిఎస్ఆర్‌కే విజ‌య్ కుమార్ కు మున్సిప‌ల్ శాఖ క‌మీష‌నర్ తో పాటు ప్లానింగ్ కార్య‌ద‌ర్శి, సిఈవో గా పూర్తి స్థాయి అద‌న‌పు భాద్య‌త‌లను అప్పగించారు. సుమిత్ కుమార్ కు ఏపి ఫైబ‌ర్ నెట్ ఎండితో పాటు ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డులు, మౌళిక స‌దుపాయ‌ల కామ‌ర్స్ డిపార్ట్మెంట్ పూర్తిస్థాయి అద‌న‌పు భాద్య‌త‌లు అప్పగించారు.అలాగే ఇసుకకు సంబంధించిన వ్యవహాల పర్యవేక్షణను కూడా ఆయనకే అప్పగించారు. 

ఎం హ‌రినారాయ‌ణ్ కు సిసిఎల్ స్పెష‌ల్ క‌మీష‌న‌ర్ తో పాటు పంచాయితీ రాజ్ , గ్రామీణాభివృద్ది శాఖ‌కు ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి గా పూర్తి స్థాయి అద‌న‌పు భాద్య‌త‌లు అప్పగించారు. అంతేకాకుండా ప్ర‌త్యేకంగా గ్రామ‌స‌చివాల‌యాలు, గ్రామ‌వాలంటీర్స్ శిక్ష‌ణ భాద్యతను కూడా ఆయనకే అప్పగించారు. 

వి. కోటేశ్వ‌ర‌మ్మను ప్లానింగ్ డిపార్ట్మెంట్ డిఫ్యూడి కార్య‌ద‌ర్శి నియమించారు. సంజ‌య్ గుప్తా ను సిసిఎస్ కార్యాల‌యంలో రిపోర్ట్ చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. ఇలా పరువురికి స్థానచలనం కల్పించడంతో పాటు అదనపు బాధ్యతలను అప్పగించారు. ఈ బదిలీలు జరిగిన కొద్దిరోజులకే ప్రభుత్వం అనూఫ్ సింగ్ ను బదిలీచేయడం చర్చనీయాంశంగా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios