Asianet News TeluguAsianet News Telugu

నూతన మద్యం పాలసీ... జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవలే నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టి పాత బార్ల లైసెన్సులను జగన్ ప్రభుత్వం రద్దుచేసిన విషయం తెలిసింది. తాజాగా నూతన బార్ల ఏర్పాట్లకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.  

Andhra Pradesh Government released notification on bars license
Author
Amaravathi, First Published Nov 29, 2019, 4:40 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా బార్ల లైసెన్సులకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే జనవరి ఒకటి నుంచి 2021 డిసెంబర్ 31 వరకూ రెండేళ్లపాటు బార్ల ఏర్పాటుకు కొత్తగా లైసెన్సులు జారీ చేయనున్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పోరేషన్ లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు యూనిట్ గా బార్లను కేటాయించారు. కార్పొరేషన్లలో దరఖాస్తు ఫీజు రూ. 4,50,000, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఫీజు 2,00,000 లక్షలుగా నిర్దారించారు. ఇక విజయవాడ,విశాఖపట్నంలలో దరఖాస్తు ఫీజును రూ.7,00,000 లక్షలుగా నిర్దారించారు. ఏడాదికి లైసెన్సు ఫీజును రూ.5,00,000 లక్షలుగా ప్రభుత్వం నిర్దారించింది. 

ఇవాళ అంటే నవంబర్  29వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు వరకూ ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఇలా వచ్చిన దరశాస్తుల్లో డిసెంబర్ 7న మధ్యాహ్నం 2 గంటలకు లాటరీ తీయనున్నట్లు ప్రకటించారు. ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో ఈ లాటరీలను తీసి అదేరోజు రాత్రి 7 గంటలకల్లా బార్ల కేటాయింపు జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios