అమరావతి: మంగళగిరిలోని సీకె కన్వెన్షన్ లో జరుగుతున్నఏపీ హోంమంత్రి సుచరిత కుమార్తె విహహ విందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హజరయ్యారు. ఆయన వదూవరులిద్దరిని ఆశీర్వదించారు. అలాగే సుచరిత దంపతులతో కలిసి నూతన వధూవరులతో ఫోటోలు దిగారు. 

ఈ విందులో సీఎంతో పాటు పలువురు మంత్రులు,ఎమ్మెల్యే, నేతలు హాజరయ్యారు. అలాగే గుంటూరు, ప్రశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన చాలామంది రాజకీయ, రాజకీయేతర ప్రముఖులు కూడా ఈ విందుకు హాజయ్యారు. అలాగే వైసిపి కార్యకర్తలు భారీసంఖ్యలో హాజయ్యారు. 

నిన్న(బుధవారం) పశ్చిమ గోదావరి జిల్లాలో సుచరిత కుమార్తె రిషిక ,దీపక్ కుమార్ వివాహ వేడుక వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి అక్కడ జరగడంతో వివాహ విందును మంగళగిరి లో ఏర్పాటుచేశారు.