Asianet News TeluguAsianet News Telugu

అంబేద్కర్  స్పూర్తి తో సిఎం జగన్ అందరికీ విద్యను అందేలా కృషి చేస్తున్నారు: ఆదిమూలపు సురేష్

మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి సందర్భంగా ఇటీవల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుకలో  మంత్రి ఆదిమూలపు సురేష్ విద్యా శాఖ, మైనారిటీ శాఖ సంయుక్తంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉంది పలు విషయాలపై మాట్లాడారు..

aadhimulapu suresh comments on ys jagan
Author
Hyderabad, First Published Nov 11, 2019, 2:56 PM IST

వేడుకలో మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. మౌలానా అబుల్ కలాం అజాద్ 142వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నాం విద్యా శాఖ, మైనారిటీ శాఖ సంయుక్తంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉంది విద్యాభివృద్ధి తోనే సమానత్వం వస్తుందని అంబేద్కర్ చెప్పారు ఆయన స్పూర్తి తో సిఎం జగన్ అందరికీ విద్యను అందేలా కృషి చేస్తున్నారు.

మైనారిటీ లకు మంచి విద్య అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది గత పాలకులు వారిని ఓటు బ్యాంకు కోసం వినియోగించుకున్నారు జగన్.. అంజాద్ భాషా కు ఉప ముఖ్యమంత్రి ఇచ్చి.. పక్కన కూర్చోబెట్టుకున్నారు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈరోజు ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నాం కార్పొరేట్ విద్యా సంస్థల కు పోటీగా ఫలితాలు సాధించిన ప్రభుత్వ విద్యార్దులకు ప్రోత్సాహం అందించాలని జగన్ నిర్ణయించారు.

aadhimulapu suresh comments on ys jagan

ఈ యేడాది ప్రభుత్వ విద్యా సంస్థ లలో ప్రతిభ ఉన్న వారికే అవార్డులు అందించాం వైయస్ ఫీజు రీయంబర్స్ మెంట్ ఇచ్చి పేదలకు ఉన్నత విద్యను దగ్గర చేశారు జగన్ కూడా దళితులు, మైనారిటీ లకు మెరుగైన విద్యను అందించేలా సంస్కరణ లకు శ్రీకారం చుట్టారు తన పాదయాత్ర లో ప్రజల కష్టాలు నేరుగా విని...‌వారి కన్నీరు తుడిచేలా పధకాలు అమలు చేస్తున్నారు.  

ఇంగ్లీషు మీడియం స్కూల్స్ అందుబాటులోకి తీసుకురావడం జగన్ చిత్తశుద్ధి నిదర్శనం దీనిపై ఎంతో మంది అవాకులు, చవాకులు పేలుతున్నారు జగన్ ఇంగ్లీషు లో మాట్లాడితే జాతీయ ఛానళ్లే ఆశ్చర్యపోతాయి నారా వారు కూడా మాట్లాడతారు.. మనం చూశాం.. బ్రీఫ్ డ్ మీ అని వందల, వేల కోట్లు కమిషన్ కోసం ప్రజా ధనాన్ని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసింది ప్రభుత్వ స్కూళ్ల ను మార్చేసే ఆలోచనతో జగన్ నాడు..నేడు కు శ్రీకారం చుట్టారు ప్రతిఒక్కరూ చదువుకోవాలనే... అమ్మ ఒడి పధకాన్ని అందిస్తున్నారు విద్యా వ్యవస్థ లో నూతన ప్రణాళికలు భవిష్యత్తు తరాలకు వరంగా మారతాయి

Follow Us:
Download App:
  • android
  • ios