తాడికొండ: గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం శాఖమురు గ్రామ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. శాఖమురు గ్రామ సమీపంలో   నిర్మాణంలో ఉన్న ఎన్జీవో క్వార్టర్స్ వద్ద ఆగివున్న క్రేన్ కి ఉరేసుకుని వేలాడుతున్న ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో వెంటనే వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. 

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడిని అమరావతి మండలం లేమల్లె గ్రామానికి చెందిన రాముగా గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన  తుళ్ళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.