అమరావతి రాజధాని ప్రాంతంలో దారుణం జరిగింది. వికలాంగురాలిపై వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఐనవోలు గ్రామానికి చెందిన బలిమి తిరుపతిరావు, అదే గ్రామానికి చెందిన వికలాంగురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటనకు సంబంధించి తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో 376, 354(A), 323(B), 448, 3(1)(W), సెక్షన్ల క్రింద కేసు నమోదైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Also Read:తల్లి రెండో పెళ్లి.. బాలికపై సొంత తాత, మేనమామే కన్నేసి...

కాగా హైదరాబాద్‌ బండ్లగూడలో ఓ బాలికపై రెండేళ్లపాటు మేనమామ, ఆరు నెలలుగా సొంత తాత బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్ నగరంలోనే చోటుచేసుకోవడం విషాదకరం. వారి అరచకాలు తట్టుకోలేక బాలిక ఆమె కన్న తల్లికి చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

బండ్లగూడ ప్రాంతానికి చెందిన ఓ మహిళ కు పెళ్లై కుమార్తె ఉంది. ఐదు సంవత్సరాల క్రితం సదరు మహిళ భర్త మృతిచెందాడు. దీంతో ఆమెకు బంధువులు మరో వివాహం జరిపించారు. భర్తతో కలిసి బండ్లగూడలో కాపురం పెట్టింది. కుమార్తెను తన తండ్రి ఫేక్ ఆఫ్సర్(70)వద్ద వదిలిపెట్టింది.

Also Read:హీరో రవితేజ తమ్ముడికి బ్లూఫిలింస్ సప్లై చేసేది రఘునందనరావే: రాధారమణి

ఆ ఇంట్లో సదరు మహిళ తండ్రితో పాటు ఆమె సోదరుడు అలియాస్ నవాజ్(25) కూడా ఉంటున్నాడు. కాగా... ఆ ఇంట్లో ఉంటున్నప్పటి నుంచి బాలికకు లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. రెండేళ్లపాటు బాలికను బెదిరించి మేనమామ అఘాయిత్యానికి పాల్పడగా... గత ఆరునెలలుగా బాలిక తాత కూడా ఆమెపై ఘాతుకానికి పాల్పడ్డాడు