Asianet News TeluguAsianet News Telugu

బాకీ తీరిస్తే సరిపోదు.. కోరిక తీర్చాలి: మహిళకు ఫైనాన్షియర్ల వేధింపులు

బాకీ తీర్చడమే కాకుండా కోరిక కూడా తీర్చాలంటూ నర్సరావుపేటకు చెందిన ఓ మహిళను వేధించిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

3 financiers arrest in narsaraopet over sexual harassment
Author
Narasaraopeta, First Published Nov 20, 2019, 4:05 PM IST

బాకీ తీర్చడమే కాకుండా కోరిక కూడా తీర్చాలంటూ నర్సరావుపేటకు చెందిన ఓ మహిళను వేధించిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే... నరసరావుపేట పట్టణానికి చెందిన ఓ మహిళ కుమారుడి చదువు కోసం పట్టణానికే చెందిన మాధవరావు, ప్రసాదు, మోహనరావు అనే ముగ్గురు వ్యక్తుల  నుంచి ఐదు లక్షలు అప్పుగా తీసుకుంది.

ఆ సమయంలో ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లపై సంతకాలు సైతం తీసుకున్నారు. ప్రతి నెల రూ.15 వేలు చెల్లిస్తున్నప్పటికీ.. ఇంటికి వచ్చి ఆమె ఏటీఎం కార్డును తీసుకెళ్లారు. బాకీ తీర్చిన తర్వాతనే ఏటీఎం కార్డును ఇస్తామంటూ ప్రతి నెలా రూ.30 వేలు చొప్పున రెండున్నర సంవత్సరాలు డ్రా చేసుకున్నారు.

Also Read:బాకీ తీర్చనందుకు.. స్నేహితుడి భార్యను పెళ్లిచేసుకున్నాడు.. గర్భం దాల్చిన భార్య

అలా మొత్తం రూ.8 లక్షలు వసూలు చేశారు. ఈ క్రమంలో బాధితురాలు తన బాకీ రూ.3 లక్షలైతే... రూ. 8 లక్షలు ఎందుకు తీసుకున్నారని ఆమె ప్రశ్నించింది. దీంతో వారు అప్పు తీరిస్తే సరిపోదని తమ కోరికను తీర్చాలంటూ రాత్రి వేళల్లో ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు.

వారి వేధింపులు రోజు రోజుకు ఎక్కువ అవుతుండటంతో బాధితురాలు సోమవారం గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది.

Also Read:బాకీ తీర్చలేదని.. సలసలకాగుతున్న నూనెలో మహిళ తల ముంచి..

వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను జీజీహెచ్‌కు తరలించారు. ఎస్పీ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన నర్సరావుపేట టూ టౌన్ పోలీసులు మాధవరావు, ప్రసాద్, మోహనరావును అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios