వీఆర్వో అభ్యర్థుల దృవపత్రాల పరిశీలన తేదీ ఖరారు...
తెలంగాణ ప్రభుత్వం గ్రామ స్థాయిలో పరిపాలన సజావుగా సాగేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గ్రామ పాలనలో ముఖ్యపాత్ర వహించే వీఆర్వో( విలేజ్ రెవెన్యూ ఆఫీసర్), జూనియర్ పంచాయితీ సెక్రటరీ పోస్టుల నియామకాలను భారీ ఎత్తున చేపడుతోంది. ఈ రెండు రకాల ఉద్యోగాల నియామకాలను చేపట్టిన ప్రభుత్వం అతి త్వరలో భర్తీ ప్రక్రియను ముగించాలని భావిస్తోంది.

ఇప్పటికే 700 వీఆర్వో ఉద్యోగాలకు ప్రభుత్వం టీఎస్‌పిఎస్సి ద్వారా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం ఇప్పటికే రాత పరీక్ష ముగిసి ఫలితాలు కూడా వెలువడ్డాయి.ఫలితాల్లో మెరిట్ జాబితా ప్రకారం ఒక్కో ఉద్యోగానికి 1:3 నిష్పత్తిలో అభ్యర్ధులను ఎంపిక చేసి వారి జాబితాను టీఎస్‌పిఎస్సి అధికారిక వెబ్ సైట్ లో పెట్టారు. ఈ అభ్యర్థులకు జనవరి 3వ తేదీ నుండి సర్టిఫికేట్ వెరిపికేషన్ కు పిలుస్తున్నట్లు టీఎస్‌పిఎస్సి సెక్రటరీ వాణీ ప్రసాద్ ప్రకటించింది.
అప్పటివరకు అవసరమైన దృవపత్రాలను అభ్యర్థులు సమకూర్చుకోవాలని ఆమె సూచించారు. సర్టిపికేట్ వెరిఫికేషన్ జరిగే కేంద్రాల వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు వాణి ప్రసాద్ తెలిపారు.
టిఎస్‌పిఎస్సి 700 వీఆర్వో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,58,885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో రాతపరీక్షకు 7,87,049 మంది అభ్యర్థులు హజరయ్యారు. కొద్దిరోజుల క్రితమే ఫలితాలను విడుదల చేసిన అధికారులు మెరిట్ జాబితాను టీఎస్‌పీఎస్సీ వెబ్ సైట్ లో పొందుపర్చారు. తాజాగా దృవపత్రాల పరిశీలన తేదీలను ప్రకటించిన టీఎస్‌పిఎస్సి అధికారులు సాధ్యమైనంత తొందరగా నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.