Asianet News TeluguAsianet News Telugu

యువతకు ప్రధాని నూతన సంవత్సర కానుక: స్వయంగా ప్రకటించిన రైల్వే మంత్రి

దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కేంద్ర ప్రభుత్వ సంస్ధ అయిన భారతీయ రైల్వేలో భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ఇప్పటికే నోటిపికేషన్ జారీ చేసి...అర్హతగల అభ్యర్థులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోడానికి అవకాశం కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  

jobs recruitment notification released in railway department
Author
New Delhi, First Published Jan 2, 2019, 3:10 PM IST

దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కేంద్ర ప్రభుత్వ సంస్ధ అయిన భారతీయ రైల్వేలో భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ఇప్పటికే నోటిపికేషన్ జారీ చేసి...అర్హతగల అభ్యర్థులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోడానికి అవకాశం కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  

ఈ నియామకాలకు సంబంధించిన కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా స్పందించారు. ఆయన తన అధికారికి ట్విట్టర్ ద్వారా ఈ విధంగా ట్వీట్ చేశారు. ''నూతన సంవత్సరంలో మోదీ ప్రభుత్వం అందిస్తున్న కానుక: ఇప్పటికే తమ ప్రభుత్వంలో భారతీయ రైల్వేలో లక్షకు పైగా ఉద్యోగ నియామకాలను చేపట్టింది. అంతటితో ఆగకుండా దేశ యువకుల కోసం  మరోసారి 13 వేలకు పైగా ఉద్యోగ నియామకాలను త్వరలో రైల్వే శాఖ చేపట్టనుంది'' అంటూ గోయల్ తెలిపారు. 

మొత్తంగా ఇండియన్ రైల్వేస్ లో ఖాళీగా వున్న జూనియర్ ఇంజనీర్ (జెఇ), జూనియర్ ఇంజనీర్ (ఐటి), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ 13,487 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.  జూనియర్ ఇంజనీర్12844, జూనియర్ ఇంజనీర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)  29, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ 227, కెమికల్‌ అండ్‌ మెటలర్జికల్ అసిస్టెంట్ 387 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 

ఇప్పటికే ఈ ఉద్యోగాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించినట్లు, జనవరి 31 వరుకు అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ నియామక ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారం కోసం రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించవచ్చని రైల్వే శాఖ ప్రకటించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios