Asianet News TeluguAsianet News Telugu

గురుకుల టీచర్ అభ్యర్థులకు వీహెచ్ అండ

తాము ఉద్యోగాల లేక నానా ఇబ్బందులు పడుతుంటే...టీఎస్‌పిఎస్సీ( తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్)సభ్యులు, ఉద్యోగులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారని నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల పీఈటి, టీఆర్‌టీ ఉద్యోగాల కోసం నోటిపికేషన్లు జారీ చేసినా...ఇప్పటివరకు నియామకాలు చేపట్టకపోవడంపై అభ్యర్ధులు ఆందోళనకు దిగారు. 

gurukul teacher posts recruitment
Author
Hyderabad, First Published Dec 19, 2018, 6:57 PM IST

తాము ఉద్యోగాల లేక నానా ఇబ్బందులు పడుతుంటే...టీఎస్‌పిఎస్సీ( తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్)సభ్యులు, ఉద్యోగులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారని నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల పీఈటి, టీఆర్‌టీ ఉద్యోగాల కోసం నోటిపికేషన్లు జారీ చేసినా...ఇప్పటివరకు నియామకాలు చేపట్టకపోవడంపై అభ్యర్ధులు ఆందోళనకు దిగారు. 

ఈ ఉద్యోగాల భర్తీ కోసం గతంలో నోటిఫికేషన్ విడుదల చేసి రాత పరీక్ష కూడా నిర్వహించారని...అయినా ఇప్పటివరకు నియామకం ప్రక్రియ ముందుకు సాగడంలేదని ఆరోపించారు. కోర్టు కేసుల వల్ల భర్తీ ప్రక్రియ ముందుకు సాగడంలేదని అన్నారు. ఈ కేసులను త్వరగా పరిష్కరించి ఉద్యోగాల భర్తీ చేపట్టాల్సిన టీఎస్‌పిఎస్సి బృందం వార్షిక సంబరాల పేరిట వినోదాల్లో మునిగితేలుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  

 గురుకుల పీఈటి, టీఆర్‌టీ అభ్యర్ధులు గాంధీ భవన్ లో కాంగ్రెస్ నాయకులు వి. హన్మంతరావు, మానవతారాయ్ లను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ ఉద్యోగాల భర్తీ వేగంగా జరిగేలా కాంగ్రెస్ పార్టీ తరపున పోరాడాలని సూచించారు. దీనిపై స్పందించిన వీహెచ్ వీరి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.    

టీఎస్‌‌‌‌‌పీఎస్సీ నాలుగో వార్షికోత్సవం సందర్భంగా కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇలా సంబరాలు చేసుకోవడాన్ని నిరుద్యోగ అభ్యర్ధులు తప్పుబట్టారు. వారి ప్రథమ కర్తవ్యమైన ఉద్యోగ భర్తీలను సక్రమంగా చేపట్టకుండా...వేడుకలపు మాత్రం ఏమాత్రం ఆటంకం లేకుండా నిర్వహించుకున్నారంటూ నిరుద్యోగులు ఎద్దేవా చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios