Radhe Shyam: ‘రాధేశ్యామ్’...కరోనా కష్టాలు స్టార్ట్?
భారీ బడ్జెట్‌తో ‘రాధేశ్యామ్’పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. సినిమాను అధికభాగం ఇటలీలోనే చిత్రీకరించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం ‘రాధేశ్యామ్’. యూవీ క్రియేషన్స్ పతాకంపై ‘జిల్’ఫేమ్ రాధాకృష్ణ దర్వకత్వంలో ఈ అందమైన ప్రేమకావ్యం రూపుదిద్దుకుంది. భారీ బడ్జెట్‌తో ‘రాధేశ్యామ్’పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కింది. చాలా కాలంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాపై భారీ గా సమయాన్ని, డబ్బు పెట్టారు నిర్మాతలు. దాంతో ఈ సినిమాకు భారీగా ప్రమోషన్ ఈవెంట్స్ నిర్వహించి క్రేజ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అందుకోసం ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఎల్ బి స్టేడియంలో నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారు.
అయితే ప్రభుత్వం ఫర్మిషన్ ఇచ్చేటట్లు కనపడటంలేదు. ఓమ్రికాన్ భయంతో ఇప్పటికే ప్రభుత్వం చాలా ఎలర్ట్ గా ఉంది. ఎక్కడా జనాలు భారీగా గుమిగూడవద్దని చెప్తోంది. మాస్క్ లని ఖచ్చితంగా వాడాలని అంటోంది. ఈ నేపధ్యంలో ప్రభాస్ సినిమా ఈవెంట్ అంటే చాలా మంది జనం గుమి గూడతారు. కోవిడ్ కేసులు భారీగా వచ్చే అవకాసం ఉందని భావిస్తోందని చెప్తున్నారు. పోలీస్ లు సైతం ఫర్మిషన్ కావాలంటే ముందుగా హెల్త్ డిపార్టమెంట్ ఒప్పుకోవాలని చెప్తున్నారు. ఎల్ బి స్టేడియంలో సరిలేరు నీకెవ్వరూ సినిమా భారీగా ఈవెంట్ జరిగింది.ఈ నేపధ్యంలో ప్రబాస్ ఈవెంట్ జరుగుతుందా లేదా అనేది ప్రశ్నార్దకంగా మారింది.
చిత్రం విషయానికి వస్తే... ఈ ‘రాధేశ్యామ్’లో రొమాంటిక్ లవ్ డ్రామా హైలెట్ గా నడవనుంది. జ్యోతిష్యం చుట్టూ తిరిగే ఈ కథలో ప్రేమ సీన్స్ అద్బుతంగా వచ్చాయని, వాటిని నమ్మే ప్రబాస్ ఇన్ని రోజులు డేట్స్ ఇచ్చారని, నిర్మాతలు ఎంత డబ్బు సెట్స్ నిమిత్తం,షూటింగ్ నిమిత్తం ఖర్చు అవుతున్నా ఓకే అన్నారని తెలుస్తోంది. ప్రభాస్ వరసగా యాక్షన్ సినిమాలో మనకు కనిపిస్తున్నారు. ఈ సినిమా ఆయన్ను బాహుబలి ముందు రోజుల నాటి డార్లింగ్, పౌర్ణమి, వర్షం వంటి లవ్ స్టోరీలను గుర్తు చేస్తుందని అంటున్నారు. అది ఖచ్చితంగా ప్రభాస్ అభిమానులకు విజువల్ ఫీస్ట్ గా ఉంటుందని చెప్తున్నారు. సెకండాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ అద్బుతంగా ఉంటాయని వాటిని డైరక్టర్ నమ్మి సినిమా చేస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా రషెష్ చూసిన ప్రభాస్, దర్శకుడు, ఆయన టీమ్ చాలా నమ్మకంగా ఉన్నారట. ప్రభాస్, పూజ మధ్య వచ్చే సీన్స్ నెక్ట్స్ లెవిల్ లో ఉండబోతున్నాయి.
భారీ బడ్జెట్‌తో ‘రాధేశ్యామ్’పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. సినిమాను అధికభాగం ఇటలీలోనే చిత్రీకరించారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.. భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు.
Also read Nitya Menen:ప్రభాస్ ఇష్యూతో నిజాయితీగా ఉండకూడని నాకు అర్థమైంది... నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్
నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, సత్యరాజ్, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, జగపతిబాబు, జయరాం, సచిన్ ఖేడ్‌కర్, భీనా బెనర్జి, మురళి శర్మ, శాషా ఛత్రి, ప్రియదర్శి, రిద్దికుమార్, సత్యాన్ తదితరులు సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస ఎడిటర్ : కొటగిరి వెంకటేశ్వరావు యాక్షన్, స్టంట్స్ : నిక్ పవల్, సౌండ్ డిజైన్ : రసూల్ పూకుట్టి కొరియోగ్రఫి : వైభవి మర్చంట్ కాస్ట్యూమ్స్ డిజైనర్ : తోట విజయ భాస్కర్ అండ్ ఎకా లఖాని వి ఎఫ్ ఎక్స్ సూపర్‌వైజర్ : కమల్ కన్నన్ ఎక్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ : ఎన్.సందీప్, హెయిర్‌స్టైల్ : రోహన్ జగ్టప్ మేకప్ : తరన్నుమ్ ఖాన్ స్టిల్స్ : సుదర్శన్ బాలాజి పబ్లిసిటి డిజైనర్ : కబిలాన్ పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను కాస్టింగ్ డైరక్టర్ : ఆడోర్ ముఖర్జి ప్రోడక్షన్ డిజైనర్ : రవీందర్ చిత్ర సమర్పకులు : "రెబల్‌స్టార్" డాక్టర్ యు వి కృష్ణంరాజు నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రశీదా దర్శకుడు : రాధాకృష్ణ కుమార్.
Also read Project K: ప్రభాస్-దీపికా పదుకొనె వరల్డ్ బిగ్గెస్ట్ మూవీ స్టార్ట్.. ఫస్ట్ షాట్ చూశారా?