Rejasekhar:రాజశేఖర్ కు జీవితే విలన్ గా మారిందా,ఆ ప్రాజెక్టు నుంచి తప్పించారా?
ఆయనకు ఈ ఆఫర్ తప్పిపోవడానికి ఆయన భార్య జీవిత కారణమంటున్నారు. ఈ సినిమా రాజశేఖర్ పాత్ర విషయంలో జీవిత ఎక్కువగా కలుగ చేసుకుందట. చాలా సార్లు రాజశేఖర్ క్యారక్టర్ విషయంలో మార్పులు చెప్పారట
రాజశేఖర్ చాలా కాలం నుంచి తాను విలన్ పాత్రలు చేస్తా అంటున్నారు. చేయడానికి సిద్ధంగానే ఉన్నాననే మీడియా ద్వారా సంకేతాలనిస్తూ వస్తున్నారు. ఆ క్రమంలోనే గతంలో ఒకటి రెండు సినిమాల్లో ఆయన విలన్ గా చేస్తున్నట్టుగా వార్తలు కూడా వచ్చాయి. కానీ రకరకాల రీజన్స్ వల్ల, ఆ ప్రాజెక్టులు కార్యరూపాన్ని దాల్చలేదు. అయితే ఇప్పుడు ఆయన ఓ పెద్ద ప్రాజెక్టులో విలన్ గా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.
గోపీచంద్ హీరోగా శ్రీవాస్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ పాత్రలో రాజశేఖర్ చేస్తున్నట్టుగా చెప్పారు. ఇప్పుడేమో ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకున్నారని అంటున్నారు. కారణమేమిటనేది అఫీషియల్ గా తెలియదుగానీ, ఈ వార్త మాత్రం జోరుగానే వినిపిస్తోంది.
అయితే గోపిచంద్ సినిమా నుంచి రాజశేఖర్‌ను తప్పించడానికి కారణమిదే అంటూ మీడియాలో ఒక వార్త ప్రచారం జరుగుతోంది. ఆయనకు ఈ ఆఫర్ తప్పిపోవడానికి ఆయన భార్య జీవిత కారణమంటున్నారు. ఈ సినిమా రాజశేఖర్ పాత్ర విషయంలో జీవిత ఎక్కువగా కలుగ చేసుకుందట. చాలా సార్లు రాజశేఖర్ క్యారక్టర్ విషయంలో మార్పులు చెప్పారట. విలన్ పాత్రను కాస్తా మెల్లిగా హీరో చేస్తూ మల్టి స్టారర్ లుక్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారట. దీంతో ఈ విషయంలో ఆమె ప్రమేయం దర్శక, నిర్మాతలకు చికాకు తెప్పించిందట. దీంతో గోపించంద్-శ్రీవాస్ ప్రాజెక్ట్ నుంచి రాజశేఖర్‌ను తీసేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై చిత్ర టీమ్ కానీ, జీవిత రాజశేఖర్లు స్పందించే వరకు వేచి చూడాలి.
అయితే ఇది విన్న పలువురు.. విలన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న రాజశేఖర్ ఆశలకు జీవిత విలన్ అయ్యిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక గోపీచంద్ తో 'లక్ష్యం' .. 'లౌక్యం' తరువాత శ్రీవాస్ చేస్తున్న సినిమా ఇది. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్లు కావడం వలన ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా నుంచి రాజశేఖర్ తప్పుకోవడం వలన, జగపతిబాబును తీసుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.