Acharya:అతడిపై కోపాన్ని 'ఆచార్య' పై చూపిస్తున్న దిల్ రాజు?

 క‌రోనా కేసులు పెరిగిన నేప‌థ్యంలో జ‌న‌వ‌రిలో రిలీజ్ కావాల్సిన పెద్ద సినిమాల‌న్నీ వాయిదా ప‌డ్డాయి. అందులో ఆర్ఆర్ఆర్, ఆచార్య ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితులు క్రమంగా కుదుటపడుతుండడంతో ఒక్కో సినిమా విడుదల తేదీల ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తున్నాయి.

Why Dil raju locked F3 movie release daton on April 28th?


క‌రోనా దెబ్బతో ఆగిపోయిన సినిమాల‌న్నీ ఒక్కొక్క‌టిగా రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో  మెగాస్టార్ చిరంజీవి న‌టించిన‌ ఆచార్య మూవీ విడుద‌ల తేదీ ఖ‌రారైంది. ఏప్రిల్ 29న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్నాడు ఆచార్య‌. అయితే ఇదే సినిమా రిలీజ్ కు ముందు రోజు ఎఫ్ 3 రిలీజ్ కానుంది. ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఏర్పాటుచేసి మరీ, నిర్మాతలంతా కూర్చొని చర్చించుకుని రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్నారు. ఏ రెండు పెద్ద సినిమాలు క్లాష్ అవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు నిర్మాతలు.  అందరికీ ఆమోదయోగ్యమైన డెసిషన్స్ తో ముందుకెళ్తున్నారు. ఇలాంటి  పరిస్థితుల మధ్య కూడా రెండు పెద్ద సినిమాల మధ్య పోటీ ఏర్పడటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ పరిస్దితికి  కారణం ఎవరు?

మీడియా వర్గాల్లో వినపడుతున్న దాన్ని బట్టి, ఫిల్మ్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతున్న దాన్ని బట్టి ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో ఉన్న కీలకమైన వ్యక్తి దిల్ రాజే ఈ మొత్తం వివాదానికి కారణంగా చూపెడుతున్నారు. దిల్ రాజు తీస్తున్న ఎఫ్3 సినిమాను ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్టు ప్రకటించటమే ఈ టాపిక్ కు కారణమైంది. ఎప్పుడైతే ఆచార్య సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నామని ప్రకటించారో...   ప్రకటన వచ్చిన కొన్ని గంటలకే ఎఫ్3 సినిమా 28న వస్తుందని దిల్ రాజు నుంచి స్టేట్ మెంట్ వచ్చింది.

దీంతో సినీ జనాలంతా ఆశ్చర్యపోయారు. ఎంతో పేరున్న నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఇలాంటి పని చేయడం ఏంటంటూ చర్చలు మొదలుపెట్టారు. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనక రీజన్ వేరే ఉందని  చెప్తున్నారు. అదేమిటంటే... ఆచార్య నైజాం రైట్స్ కోసం దిల్ రాజు గట్టిగా ట్రై చేశారు. కానీ దిల్ రాజు కోట్ చేసిన మొత్తం కంటే ఇంకాస్త ఎక్కువకు వరంగల్ శ్రీను, ఆచార్య రైట్స్ తీసుకున్నారు. దాంతో దిల్ రాజుకు కోపం వచ్చిందని చెప్తున్నారు. గత కొంతకాలంగా  వరంగల్ శ్రీను, దిల్ రాజు మధ్య సరైన సయోధ్య లేదు.

 రవితేజ  క్రాక్ రిలీజ్ టైమ్ లో పెద్ద గొడవ జరిగిన సంగతి తెలిసిందే. దిల్ రాజు కాదు, కిల్ రాజు అంటూ వరంగల్ శ్రీను వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కూడా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఆచార్యకు పోటీగా ఒక్క రోజు ముందు ఎఫ్3 సినిమాను దిల్ రాజు రిలీజ్ కు రెడీ చేశారంటూ ఫిలిం సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది.  అయితే ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

ఇక మార్చి 25న ఆర్ఆర్ఆర్ విడుద‌ల అవుతున్న నేప‌థ్యంలో ప‌రస్ప‌ర అవ‌గాహ‌న‌తో త‌మ చిత్రాన్ని ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్న‌ట్లు తెలిపింది. చిరంజీవి, రామ్ చరణ్, కాజల్, పూజా హెగ్డే నటించిన ఆచార్య చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణ సంస్థ‌లు తెరకెక్కించాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios