Bimbisara :‘బింబిసార’కు మూలం ఆ నెట్ ఫ్లిక్స్ సీరిస్ ?
అప్పటి క్రూరుడైన రాజు బింబసార ఈ కాలానికి వచ్చి ఏం చేయనున్నారు..'బింబిసార' ధోరణి ఎలా ఉండేది .. ఆయన కాలంతో ముడిపడిన నిధిని ఈ కాలంలో చేజిక్కుంచుకోవాలనుకున్నవారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వంటి విషాయాలతో వర్తమానంలోను .. గతంలోను ఈ కథ నడుస్తుందని అర్థమవుతోంది.
హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు నందమూరి కళ్యాణ్ రామ్ . కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం‘బింబిసార’. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. వశిష్ఠ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 18వ చిత్రమిది.
ఆ మధ్యన ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. బింబిసార చిత్రాన్ని ఆగస్ట్ 5న విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఏదన్నా ప్రేరణతో రూపొందుతోందా అనే ఆసక్తికరమైన చర్చలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి.
మీడియా జనం మాట్లాడుకునేదాన్ని బట్టి ఈ చిత్రం Always a Witch అనే స్పానిష్ వెబ్ సీరిస్ నుంచి ప్రేరణ పొందారు. ఈ సీరిస్ చాలా మంచి పేరు వచ్చింది. 1646 కొలంబియాలో ఓ అమ్మాయిని చేతబడి తరహా బ్లాక్ మ్యాజిక్ చేస్తోందని మంటల్లోకి తోసి తగలెట్టేస్తారు. ఆమె మళ్లీ టైమ్ ట్రావెల్ చేసి ఇప్పటికాలానికి వస్తుంది. చాలా క్రూరంగా ఉంటుంది ఆమె పాత్ర. దాదాపు అలాంటి కథే బింబిసార అంటున్నారు. 500వ శతాబ్దంలో మగధ దేశ రాజు భట్టియా కుమారుడైన బింబిసార జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
బింబిసార చిత్రంలో ఓ అద్దం చుట్టూ కథ తిరుగుతుంది. ఈ కథలో రెండు డిఫరెంట్ టైమ్ లైన్స్ ఉంటాయి. వీటికి అద్దానికి లింక్ ఉంటుంది. ఓ మ్యాజిక్ మిర్రర్ ద్వారా ఆ కాలం నుంచి ఈ కాలానికి, ఈ కాలం నుంచి ఆ కాలానికి వెళ్లటం జరుగుంది. అసలు ఆ మ్యాజిక్ మిర్రర్ మిస్టరీ ఏమిటి... అప్పటి క్రూరుడైన రాజు బింబసార ఈ కాలానికి వచ్చి ఏం చేయనున్నారు..'బింబిసార' ధోరణి ఎలా ఉండేది .. ఆయన కాలంతో ముడిపడిన నిధిని ఈ కాలంలో చేజిక్కుంచుకోవాలనుకున్నవారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వంటి విషాయాలతో వర్తమానంలోను .. గతంలోను ఈ కథ నడుస్తుందని అర్థమవుతోంది. అందులో నిజమెంత అనే విషయం తెలియాలంటే సినిమా రిలీజ్ దాకా ఆగాలి.
‘బింబిసారలో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కీలకంగా ఉండబోతున్నాయి. భారీ సెట్స్‌తో కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న హై టెక్నికల్ వేల్యూస్ మూవీ ఇది. ఆగస్ట్ 5న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ తెలియజేసింది. కళ్యాణ్ రామ్ సరసన కెథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఆ మధ్య విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని తెలుస్తుంది. ప్రకాశ్ రాజ్ .. వెన్నెల కిశోర్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. కేథరిన్ .. సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా గా నటించిన ఈ సినిమా, ఆగస్టు 5వ తేదీన విడుదల చేయనున్నారు
‘గౌతమి పుత్ర శాతకర్ణి’, ‘జై సింహా’, ‘కంచె’ (Kanche Movie) సినిమాలకు సంగీతం అందించిన చిరంతన్ భట్ ‘బింబిసార’చిత్రానికి మ్యూజిక్ అందిస్తుండటంతో అంచనాలు పెరిగాయి. చాలా కాలం తర్వాత ‘118’తో తిరిగి హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు.