- Home
- Entertainment
- Gossips
- బాలయ్య సినిమా కోసం బోయపాటి భారీ రెమ్యునరేషన్, అఖండ 2 కోసం ఎంత తీసుకున్నాడంటే?
బాలయ్య సినిమా కోసం బోయపాటి భారీ రెమ్యునరేషన్, అఖండ 2 కోసం ఎంత తీసుకున్నాడంటే?
Boyapati Sreenu Massive Remuneration : బాలకృష్ణ, బోయపాటి కాంబోలో నాలుగో సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. అఖండ2 తో అభిమానులకు పూనకాలు తెప్పించడానికి సిద్దమయ్యాడు బాలయ్య. మరి ఈసినిమా కోసం దర్శకుడు బోయపాటి శ్రీను ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా?

బాలయ్య బోయపాటి హిట్ కాంబినేషన్
బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటే అది పక్కా హిట్ అవుతుందన్న నమ్మకం అభిమానుల్లో ఉంటుంది. బోయపాటి శ్రీను బాలకృష్ణ తో చేసిన ప్రతీ సినిమా అభిమానులను అలరించింది, బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇక తాజాగా అఖండా 2తో ఈ సక్సెస్ ఫుల్ కాంబో మరోసారి సందడి చేయనుంది. అయితే ఈసినిమా కోసం రెమ్యునరేషన్ డబుల్ చేశాడట బోయపాటి శ్రీను. ఇంతకీ ఈసినిమాకు బోయపాటి ఎంత తీసుకున్నాడు. అందులో నిజం ఎంత?
పూనకాలతో ఊగిపోతున్న అభిమానులు
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ టాలీవుడ్‌లో మాస్ బ్లాక్‌బస్టర్లకు బ్రాండ్‌గా నిలిచింది. ఈ కాంబోలో ఇప్పటివరకు వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ చేశాయి. ఈ సక్సెస్ ఫుల్ జర్నీలో బాలయ్య, బోయపాటి కలిసి చేస్తున్న నాలుగో చిత్రం అఖండ 2. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అఖండ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ మూవీలో, బాలకృష్ణ పోషించిన అఘోర పాత్ర అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్‌కు అభిమానులుకు పూనకాలతో ఊగిపోయారు. కామన్ ఆడియన్స్ నుంచి కూడా ఈ ట్రైలర్ కు భారీగా స్పందన వచ్చింది.
రెమ్యూనరేషన్ డబుల్ చేసిన బోయపాటి?
ఇక మాస్, హై వోల్టేజ్ యాక్షన్‌తో కూడిన ఈ సీక్వెల్ మూవీ డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్‌లో థియేటర్లలో విడుదల కానుంది.ఈ నేపథ్యంలో ఈసినిమాకు సబంధించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నారని టాక్. గతంలో ఆయన రామ్ హీరోగా నటించిన స్కంద సినిమా కోసం 18 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు టాక్. స్కంద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, బోయపాటి రెమ్యునరేషన్ తగ్గుతుందని చాలామంది భావించారు. కానీ అఖండ2 కోసం రెమ్యునరేషన్ డబుల్ చేశాడట బోయపాటి.
బాలయ్య సినిమా కోసం ఎంత తీసుకున్నాడంటే?
అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, అఖండ 2 కోసం బోయపాటి శ్రీనుకు రూ.36 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్టు ఓ వార్త వైరల్ అవుతోంది. అంటే ఆయన గత పారితోషికం కంటే దాదాపు రెట్టింపు. ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.సాధారణంగా ఒక దర్శకుడి సినిమా ఫ్లాప్ అయితే, నెక్ట్స్ సినిమాకు రెమ్యునరేషన్ తగ్గుతుంది. కానీ బోయపాటి విషయంలో పరిస్థితి పూర్తిగా రివర్స్ అయ్యింది. బాలయ్య కాంబినేషన్ లో బోయపాటికి ఉన్న పాజిటీవ్ వైబ్రేషన్స్ కారణంగా.. నిర్మాతలు ఈ రెమ్యునరేషన్ ఇవ్వడానికి సై అన్నట్టు తెలుస్తోంది.
రిలీజ్ కు రెడీగా అఖండ2
అఖండ 2పై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. కనీసం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ చిత్రం పాన్ ఇండియా వసూళ్లలో రికార్డులు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల టాక్. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా అఖండ 2 తో బాలయ్య తాండవం చేయబోతున్నాడు. మరి ఈసినిమా ఫలితం ఎలా ఉండబోతోంది అనేది చూడాలి.

