Prabhas: సన్నబడ్డ ప్రభాస్...షాకింగ్ రీజన్

 ప్రభాస్‌ న్యూలుక్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆయన సన్నబడ్డట్టు కనిపిస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. వాటిలో డార్లింగ్‌ గత కొంతకాలంగా కనిపిస్తున్న లుక్‌కు భిన్నంగా, స్మార్ట్‌గా ఉన్నారు.

What is the real reason behind Prabhas  weight loss

మొన్న రాత్రి ముంబై, బాంద్రాలో ఆదిపురుష్ దర్శకుడు ఓంరౌత్ ఇంట్లో ఇచ్చిన పార్టీలో ప్రభాస్ కూడా పాల్గొన్నాడు. బ్లాక్ జీన్స్ మెరూన్ షర్ట్‌లో కొత్త లుక్ లో కనిపించాడు ప్రభాస్. గతంలో కంటే సన్నబడటం విశేషం.  శరీరాకృతిని తగ్గించుకోవడంపై దృష్టి పెట్టిన ప్రభాస్ ఆ విషయంలో చాలా వరకూ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.  

వైరల్ అవుతున్న రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ న్యూలుక్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆయన సన్నబడ్డట్టు కనిపిస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. వాటిలో డార్లింగ్‌ గత కొంతకాలంగా కనిపిస్తున్న లుక్‌కు భిన్నంగా, స్మార్ట్‌గా ఉన్నారు. కసరత్తులు చేసి మరీ కండలు తగ్గించినట్లు కనపడుతోంది. ‘సలార్’ లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందుకే తగ్గారు అని చెప్పుకుంటున్నారు. అయితే అసలు రీజన్ వేరే ఉందని సమాచారం.

అదేమిటంటే...డైరక్టర్  ప్రశాంత్ నీల్ పట్టుబట్టడంతోనే ప్రభాస్ మేకోవర్ చేయించుకున్నాడు.  సలార్ సినిమా రషెష్ చూసిన నీల్...ప్రభాస్ బెస్ట్ ఫామ్‌లో లేడని భావించాడు. ఫిజికల్ గా అసలు ఎట్రాక్షన్ గా లేరు. దాంతో ఇద్దరూ  అందుకే ‘కేజీఎఫ్ 2’ రిలీజ్ కు ముందు సమావేశం అయ్యారు. రషెష్ చూసిన ప్రభాస్ సైతం అది నిజమే అని ఒఫ్పుకున్నారు. దాంతో కనీసం 10 కిలోల బరువు తగ్గాలని ప్రభాస్‌ని కోరారు ప్రశాంత్ నీల్. అతను మేకోవర్ కోసం వెళ్లే వరకు కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించనని చెప్పాడు. దాంతో ప్రభాస్ ఒక వెల్‌నెస్ ప్రోగ్రామ్‌లో చేరాడు ఈ మారిన ఫిజిక్ తో బయిటకు వచ్చారు. ఇక ఫ్యాన్స్ ... ప్రభాస్‌ శారీరకంగా మారిన తీరు ఎంతో నచ్చిందని, హ్యాండ్సమ్‌గా ఉన్నారని తెగ పోస్ట్‌లు చేస్తున్నారు. దీంతో ఫొటోలు కాస్త వైరల్‌గా మారాయి.

నీల్ ఇటీవలే ‘సాలార్’ షూటింగ్‌ని రీసెంట్ గా ప్రారంభించాడు మరియు ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రం 2023 వేసవిలో థియేటర్లలోకి రానుంది.

ప్రభాస్ చిత్రాల విషయానికి వస్తే...  ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా ‘ఆదిపురుష్’ చేస్తున్నాడు. టీసీరీస్ సంస్థ దాదాపు 500కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణునిగా నటిస్తున్నారు. అయోధ్య నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. డార్లింగ్ అభిమానులు కోరుకున్నట్లు ఫిట్ గా తయారవుతున్న ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios