#VikramVedha:షాకింగ్ కలెక్షన్స్ ....బాలీవుడ్ కు పెద్ద ఎదురుదెబ్బ?
తమిళంలో 2017లో వచ్చిన విక్రమ్ వేద మూవీని అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా బాగుంది, అద్బుతం అని రివ్యూలు వచ్చినా కలెక్షన్స్ మాత్రం కనపడలేదని వినికిడి.
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘విక్రమ్ వేద’. మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన తమిళ సూపర్ హిట్ ‘విక్రమ్ వేద’ చిత్రానికి హిందీ రీమేక్ ఇది. పుస్కర్, గాయత్రి ధ్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాధికా ఆప్టే ఇతర కీలక పాత్రలో నటించింది. సెప్టెంబర్ 30న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది.
ఈ హిందీ సినిమాపై బాలీవుడ్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. వరస ఫెయిల్యూర్స్ తో ప్రాభవం కోల్పోతున్న బాలీవుడ్ ...ఉన్నంతలో బ్రహ్మాస్త్రతో ఒడ్డున పడిందని ఊపిరి పీల్చుకుంది. ఈ సినిమాతో పూర్తి స్దాయి ఫామ్ లోకి వస్తుందని ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రం ట్రైలర్ ఫుల్ యాక్షన్ సీన్స్‌తో ఫ్యాన్స్‌ను కట్టి పడేసింది. తమిళంలో 2017లో వచ్చిన విక్రమ్ వేద మూవీని అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేశారు. అయితే ఈ సినిమా బాగుంది, అద్బుతం అని రివ్యూలు వచ్చినా కలెక్షన్స్ మాత్రం కనపడలేదని వినికిడి. దాదాపు 5000 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు కేవలం పది కోట్లు మాత్రమే గ్రాస్ రాబట్టకలిగింది. ఇది బాలీవుడ్ కు షాక్ ఇచ్చింది.
మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' కి పోటీగా హిందీ 'విక్రమ్ - వేదా' విడుదలైంది. ఇందులో సైఫలీ ఖాన్ - అమీర్ ఖాన్ లు మొదట నటించాల్సింది తర్వాత సైఫలీ ఖాన్ -ఆమీర్ ఖాన్ ల పేర్లు వినబడి, అమీర్ ఖాన్ కూడా తిరస్కరించడంతో ఆఖరికి సైఫలీఖాన్- హృతిక్ రోషన్ ల కాంబినేషన్లో తెరకెక్కింది. తమిళ దర్శకులు పుష్కర్- గాయత్రి లు తమిళ పానిండియాయే అయిన మణిరత్నం సినిమాతో పోటీ పడుతూ 'విక్రమ్ -వేదా' కమర్షియల్ మాస్ తో ముందుకొచ్చారు. హిందీ ప్రేక్షకులకి కావాల్సింది మాస్ సినిమాలే అని అనుకున్నా ఫలితం ఆశాజనకంగా లేదు.
మణిరత్నం సినిమా తమిళ ప్రేక్షకులకే పరిమితమని మొదటి రోజే తేలిపోయింది. కనుక ఇప్పుడు 'విక్రమ్- వేదా' ఫలితమేమిటి? పోటీలేని వాతావరణంలో హిట్టయ్యే విషయం ఏమైనా ఇందులో వుందా? ఐదు ప్రముఖ నిర్మాణ సంస్థలు కలిసి దీనిపై వ్యయం చేసిన 175 కోట్లు సురక్షితమేనా? అనేది ఆసక్తికరమైన అంశం. విక్రమ్‌వేద చిత్రాన్ని వైనాట్ స్టుడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.