Rowdy Boys:‘రౌడీ బాయ్స్’లో ఆ ఇద్దరు స్టార్ డైరక్టర్స్ ఇన్వాల్వ్

ఎలాంటి ప్రెష‌ర్ లేదు. అయితే రాజుగారు ఎక్కువ కేర్ తీసుకున్నారు. దాని వ‌ల్ల ప్రెష‌ర్ అనిపించింది. ఫిల్మ్ మేకింగ్‌లో ఎలాంటి ప్రెష‌ర్ లేదు. ప్ర‌తి పిల్లాడుకి 17-18 ఏళ్ల వ‌య‌సున్న‌ప్పుడు మెచ్యూరిటీ ఉండ‌దు. అప్పుడు చాలా ప‌నులు చేస్తుంటాం. 

Two dil raju camp Directors Involved In Rowdy Boys


ఆశిష్ (శిరీష్ త‌న‌యుడు) హీరోగా దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్.. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రౌడీ బాయ్స్‌ సంక్రాంతి సంద‌ర్భంగా ఈ రోజు అంటే జ‌న‌వ‌రి 14న విడుద‌లయ్యింది.  ఈ సినిమా టాక్ ప్రక్కన పెడితే మరో టాక్ ఇండస్ట్రీని చుడుతోంది. అందులో నిజమెంతో కానీ డిస్కషన్ పాయింట్ గా మారింది. ఇంతకీ ఏమిటా మాటర్ అంటే..

ఈ సినిమా హీరో ఆశిష్ రెడ్డి మరెవరో కాదు...దిల్ రాజు సోదరుడు, బిజినెస్ పార్టనర్ అయిన శిరీష్ కుమారుడు. దాంతో హీరోగా నిలబెట్టడం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే తమ బ్యానర్ డైరక్టర్స్ అయిన వేణు శ్రీరామ్, అనీల్ రావిపూడిల సహాయం తీసుకున్నారట. గత కొద్ది నెలలుగా ఈ సినిమా కు ఫెరఫెక్ట్ ప్రొడక్ట్ గా బయిటకు రావటానికి కొన్ని కరెక్షన్స్ , రీషూట్స్ చేయించారట. సినిమా అల్టిమేట్ గా పెద్ద హిట్ అవటం కోసం దిల్ రాజు ఇలా చేసాడని అంటున్నారు. 

సినిమా గురించి డైరక్టర్ మాట్లాడుతూ ...  కాలేజ్ మూవీ వ‌చ్చి చాలా ఏళ్లు అయ్యింది. క‌థ రాసుకునేట‌ప్పుడు ఎవ‌రైనా యంగ్ హీరో అయితే బావుంటుంద‌ని అనుకున్నాం. కానీ ఎవ‌రినీ మైండ్‌లో పెట్టుకుని క‌థను తయారు చేయ‌లేదు. ఎలాంటి ప్రెష‌ర్ లేదు. అయితే రాజుగారు ఎక్కువ కేర్ తీసుకున్నారు. దాని వ‌ల్ల ప్రెష‌ర్ అనిపించింది. ఫిల్మ్ మేకింగ్‌లో ఎలాంటి ప్రెష‌ర్ లేదు. ప్ర‌తి పిల్లాడుకి 17-18 ఏళ్ల వ‌య‌సున్న‌ప్పుడు మెచ్యూరిటీ ఉండ‌దు. అప్పుడు చాలా ప‌నులు చేస్తుంటాం. వైల్డ్‌గా ఉంటాం. త‌ర్వాత ఓ ఏజ్ వ‌చ్చిన త‌ర్వాత ఇన్నీ చేశామా! అనిపిస్తుంది. దాన్ని సినిమాలో చూపించాం. ఆ రౌడీనెస్‌ను సినిమా చూపించాం కాబ‌ట్టి.. రౌడీ బాయ్స్ అనే టైటిల్ పెట్టాం. సినిమా చూస్తే ప్ర‌తి ఒక్క‌రికీ వారి పాత రోజులు గుర్తుకు వ‌స్తాయి అని చెప్పుకొచ్చారు.

Also Read :ఇప్పుడు మిస్‌ అయ్యింది.. వచ్చే సంక్రాంతికి చెర్రీ మిస్ కాడంటున్న దిల్‌రాజు.. రౌడీబాయ్స్ తో మొత్తం మార్చేశాడట
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios