pushpa-2 : సుకుమార్ అంత తెలివితక్కువాడేం కాదే,అది రూమరే అయ్యింటుంది

 
 `పుష్ప` కు లభించిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు సుకుమార్ `పుష్ప -2` లో భారీ మార్పులు చేస్తున్నారట. యాక్షన్ సీక్వెన్స్ తో పాటు పలు కీలక ఘట్టాల్లో మార్పులు చేసి పాన్ ఇండియా రేంజ్ లో వుండేలా ప్లాన్ చేస్తున్నారట.

Twist in Allu Arjun pushpa-2 movie

సుకుమార్, పుష్ప కాంబినేషన్ లో వచ్చిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్టైందో తెలిసిన విషయమే.  పార్ట్ 1 రిలీజైన తర్వాత బన్ని ఇప్పుడు బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోగా మారాడు. పుష్ప పార్ట్ 2 కోసం బీటౌన్ ఆడియెన్స్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రెండో భాగం రిలీజ్ చేస్తే బాహుబలి 2 స్దాయిలో హిట్ అయ్యేటట్లు ఉందని ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఈ నేపధ్యంలో పుష్ప పార్ట్ 1 ని మించి సెకండ్ పార్ట్ ఉండాలని ప్రేక్షకులు కోరుకోవటంలో ఆశ్చర్యం అయితే ఏమీ లేదు. అందుకోసం సుకుమార్ స్క్రిప్టుపై కసరత్తు చేస్తున్నారని వినిపిస్తోంది. చాలా మార్పులు హిట్టయ్యాక చేస్తున్నాడని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో కీలకమైన ట్విస్ట్ ఒకటి ఉందని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆ వార్తల్లో నిజమెంత అనేది పరిశీలించే ముందు...అసలు ఆ వార్త ఏమిటో చూద్దాం.

పుష్ఫ పార్ట్ 1 లో కేశవా అనే పాత్ర ఎంత హైలెట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. సినిమా కథను నేరేట్ చేస్తూ.. పుష్ప కు తోడుగా, తమ్ముడిలా ఉంటాడు. దీంతో ఆయన పాత్రకు కూడా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ దక్కింది. అయితే ఇప్పుడు పుష్ప పార్ట్ 2 లో కేశవా, పుష్ప రాజ్ కు వెన్నుపోటు పొడుస్తాడని, దాంతో పుష్ప రాజ్ కు ప్రాబ్లెమ్స్ వస్తాయని అదే పెద్ద ట్విస్ట్ అంటున్నారు. అయితే ఈ ట్విస్ట్ నిజమయ్యే అవకాసం లేదంటున్నారు. ఎందుకంటే ఇది యాజటీజ్ బాహుబలి కట్టప్పను పోలిన ట్విస్ట్. నమ్మిన వారినే వెన్నుపోటు పొడవటం.

అలాగే  పుష్ప రాజ్ కు విలన్ గా ఉన్న జాల్ రెడ్డి, మంగళం శీను, దాక్షాయణిలు కూడా పుష్ప పై పగ తీర్చుకునేందుకు ఎత్తులు వేస్తారట. ఇక సినిమాలో మెయిన్ విలన్ గా చూపించిన షికావత్ కూడా పుష్ప పై పగ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడని తెలుస్తుంది. వీరందరిని నుంచి తప్పించుకుని పుష్ప ఎలా తనదైన సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడనేది సెకండాఫ్ లో వచ్చే కథ అంటున్నారు. ఈ లీక్ టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  ఈ అప్డేట్స్ అన్నీ నిజమా కాదా అనేది తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.

ఇక బాహుబలి 2 హిందీ వర్షన్‌ రూ.500 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఇప్పటికీ ఈ రికార్డ్ పదిలంగా ఉంది. బాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ సల్మాన్, షారుఖ్, ఆమిర్, అజయ్ ,అక్షయ్, హృతిక్, రణభీర్,రణవీర్,ఎవరూ కూడా ఈ మార్క్ ను టచ్ చేయలేదు. అయితే ఈ రికార్డ్‌ ను బన్ని బద్దలు కొడతాడని చెబుతున్నాడు పుష్ప పార్ట్ 2 హిందీ రైట్స్ కొనుగోలు చేసిన మనీష్ షా.

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios