DJ Tillu: త్రివిక్రమ్ లాస్ట్ మినిట్ లో చేసిన పనే టిల్లుకు భారీగా ప్లస్సైంది ?!
నైజాంలో చాలా చోట్ల షోలు సోల్డ్ ఔట్, ఫాస్ట్ ఫిల్లింగ్ స్టేటస్‌లో కనిపించాయి. ప్రధాన మల్టీప్లెక్సుల్లో ఎన్ని షోలు పెడితే అన్ని షోలూ ఫుల్ అయిపోయాయి. రిలీజ్ రోజు మెజారిటీ షోలు హౌస్ ఫుల్స్ అయ్యాయి. అయితే ఈ వసూళ్లు,కలెక్షన్స్ వెనక...త్రివిక్రమ్ హస్తం ఉందంటున్నారు.
డీజే టిల్లు ఈ వీకెండ్ భాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తోంది. ఊహించని విధంగా హౌస్ ఫుల్స్ కనపడుతున్నాయి. చిన్న సినిమాకు పెద్ద అప్లాజ్ వస్తోంది. అసలు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అయినప్పటి నుంచి యూత్ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూసేలా చేయటమే ప్లస్ అయ్యింది. ఇప్పుడీ చిత్రం థియేటర్లలోకి దిగడంతో యూత్ పండగ చేసుకున్నట్లే కనిపిస్తున్నారు.
రిలీజ్ కు ముందు రోజు డీజే టిల్లుకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్సే అందరినీ ఆశ్చర్యపరిచాయి. నైజాంలో చాలా చోట్ల షోలు సోల్డ్ ఔట్, ఫాస్ట్ ఫిల్లింగ్ స్టేటస్‌లో కనిపించాయి. ప్రధాన మల్టీప్లెక్సుల్లో ఎన్ని షోలు పెడితే అన్ని షోలూ ఫుల్ అయిపోయాయి. రిలీజ్ రోజు మెజారిటీ షోలు హౌస్ ఫుల్స్ అయ్యాయి. అయితే ఈ వసూళ్లు,కలెక్షన్స్ వెనక...త్రివిక్రమ్ హస్తం ఉందంటున్నారు.
రిలీజ్ కు ముందు సినిమా చూసిన త్రివిక్రమ్ ...లాస్ట్ మినిట్ లో చెప్పిన కట్స్ కొన్ని సినిమాని కాపాడేసాయని చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా హాస్పటల్ సీక్వెన్ సినిమాలో పెద్ద సమస్యగా మారింది. మొదట ఈ సీక్వెన్స్ 28 నిముషాలు ఉండేదని...కానీ అడ్డంగా సగానికి మొహమాటం లేకుండా కట్ చేయటమే కలిసొచ్చిందని అంటున్నారు. అది కనక చేయకపోతే సినిమాలో యాజటీజ్ 28 నిముషాలు ఎపిసోడ్ ఉంటే ఈ రోజు టాక్ వేరే విధంగా ఉండేదని చెప్తున్నారు. ఈ సీన్ లెంగ్త్ తగ్గించి, వెంటనే కోర్ట్ రూమ్ డ్రామా కు వెళ్లిపోవటం, అదీ ఫన్ తో ముగించటం కలిసి వచ్చిందంటున్నారు. జాతిరత్నాలు ప్రేరణతో చేసిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా సినిమాకు పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసిందని విశ్లేషిస్తున్నారు.
కలెక్షన్స్ విషయానికి వస్తే...నైజాంలో ఈ సినిమా రికార్డ్ లు క్రియేట్ చేసేటట్లు కనిపిస్తోంది. మొదటి రోజు,రెండో రోజు నంబర్స్ సినిమా స్థాయిని నెక్ట్స్ లెవిల్ కు తీసుకుపోతున్నట్లు సిగ్నల్స్ అందుతున్నాయి. సినిమాకు కొంచెం మిక్సెడ్ టాక్ ఉన్నప్పటికీ.. టిల్లు క్యారెక్టర్.. సిద్ధు జొన్నలగడ్డ పెర్ఫామెన్స్.. డైలాగ్స్‌కు కుర్రాళ్లు బాగా కనెక్టైంది. ఆ మాత్రం ఎంటర్టైన్మెంట్ చాలదా అంటున్నారు కుర్రాళ్లు. ఈ సినిమా ఫుల్ రన్లో పది కోట్ల షేర్ రాబట్టే అవకాశాలున్నాయన్నది ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మిగతా చోట్ల ప్రక్కన పెడితే నైజాంలో మాత్రమే ఏడెనిమిది కోట్ల షేర్ వస్తుందని అంచనా. ఇవన్నీ చూస్తూంటే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యేటట్లే కనిపిస్తోంది.