Tamannaah:తమన్నా పై రెండేళ్ల దాకా ఆ వార్తలు రాయకండి
ఈ బ్యూటీ ‘క్వీన్’ రిమేక్ సినిమాతో పాటు వెంకటేశ్-వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ మూవీలో నటిస్తోంది. గుర్తుందా శీతాకాలం అనే సినిమా చేస్తోంది. గనీలో ఐటెం సాంగ్ కూడా చేస్తోంది. అలాగే చిరుతో భోళా శంకర్ చేస్తోంది.
టాలీవుడ్ లో ఓ రేంజిలో వెలుగు వెలిగిన హీరోయిన్ తమన్నాకు ఇప్పుడు ఆఫర్స్ తగ్గిపోయాయి. బాహుబలిలో నటించిన తర్వాత తమన్నా తన కెరీర్ కు ఊపు వస్తుందని ఎక్సపెక్ట్ చేసింది. కానీ ఆమెకు ఒక్క పెద్ద సినిమాలో కూడా చాన్స్ రాలేదు. సైరా వంటి సినిమాల్లో వచ్చినా కూడా పెద్దగా ఆకట్టుకునే పాత్రలేవీ లేవు. దాంతో తమన్నా త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోందనే వార్త ఇప్పుడు టాలీవుడ్ తోపాటు సోషల్ మీడియాలో మొదలైంది. హాట్ టాపిక్ గానూ మారింది. ఇప్పటికే తెలుగు - తమిళం - హిందీ భాషల్లోనూ నటించిన తమన్నాకు కొద్దిరోజులుగా సరైన సక్సెస్ లేకపోవటం కారణంగా చూపెట్టి ఓ డాక్టర్ ని ఆమె పెళ్లి చేసుకుని సెటిల్ అవుతోందని అనేసారు.
అలాగే ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 12 ఏళ్లకు పైగా అవుతోంది. దీంతో ఈ గ్లామరస్ బ్యూటీ ఇక సినిమాలు చాలించి పెళ్లి చేసుకోబోతోందనే వార్త విస్తృతంగా వ్యాపిచింది. సినిమా అవకాశాలు తగ్గడంతో తమన్నా ప్రస్తుతం పర్సనల్ లైఫ్ మీద దృష్టిపెట్టిందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఆమె ఫ్యామిలీ మెంబర్స్ తమన్నా కోసం ఓ మంచి వరుడిని ఎంపిక చేశారని వార్త ప్రచారంలోకి వచ్చింది. అమెరికాకు చెందిన ఓ డాక్టర్ తో త్వరలోనే తమన్నా వివాహం జరగనుందని వార్తలు వచ్చేసాయి.
అయితే తమన్నా తనకు అసలు ఇప్పడు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదని తేల్చేసింది. రెండేళ్ల దాకా పెళ్లి ఊసెద్దని క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం దక్షిణాది వ్యాప్తంగా పాపులర్ అయిన ఈ బ్యూటీ ‘క్వీన్’ రిమేక్ సినిమాతో పాటు వెంకటేశ్-వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ మూవీలో నటిస్తోంది. గుర్తుందా శీతాకాలం అనే సినిమా చేస్తోంది. గనీలో ఐటెం సాంగ్ కూడా చేస్తోంది. అలాగే చిరుతో భోళా శంకర్ చేస్తోంది. ఓ కన్నడ భారీ సినిమా సైన్ చేయబోతోంది. అలాగే ఆమెకు గతంలో కన్నా ఎక్కువ రెమ్యునేషన్ అందుతోంది. కోటిన్నర నుంచి రెండు కోట్లు దాకా డిమాండ్ చేస్తోంది. ఇలాంటి పరిస్దితిల్లో ఇప్పుడు పెళ్ళి అంటారేంటి అని విసుక్కుంటోందిట.