Pushpa 2 :‘పుష్ప 2’లో ఆ ట్విస్ట్...పెడతాడా ?,సుక్కూ ని తక్కువ అంచనా వేయద్దు

ఆగస్ట్  నుంచి ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం స్క్రిప్టులో ఓ ట్విస్ట్ అంటూ ఓ కథనం బయటకు వచ్చింది.   

Srivalli gets killed in Pushpa 2?

 
అల్లు అర్జున్  దృష్టి మొత్తం  పుష్ప రెండవ భాగమైన "పుష్ప: ది రూల్" పై పెట్టారు. సుకుమార్ సైతం ఈ సినిమా స్క్రిప్టు ,మిగతా పనుల తో బిజీగా ఉన్నారు. "పుష్ప: ది రూల్" సినిమా హిందీలో కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానుల తో పాటు ట్రేడ్ వర్గాలు కూడా  నమ్ముతున్నాయి. మరోవైపు ఈ సినిమాలోని ఇతర పాత్రల కోసం సుకుమార్ ఆడిషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే చాలా వరకు స్క్రిప్ట్ పని పూర్తయింది. ఆగస్ట్  నుంచి ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం స్క్రిప్టులో ఓ ట్విస్ట్ అంటూ ఓ కథనం బయటకు వచ్చింది. రష్మిక పోషిస్తున్న శ్రీవల్లి పాత్ర నిడివిని "పుష్ప: ది రూల్" సినిమాలో బాగా తగ్గించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.  
  
మీడియా వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం పుష్ప రెండవ భాగమైన "పుష్ప: రూల్" సినిమాలో మాత్రం సుకుమార్ రష్మిక పాత్రకు ఓ రేంజిలో ట్విస్ట్ ఉందిట. అలాగే ఆమె పాత్రని చాలా వరకు కట్ చేసినట్లు తెలుస్తోంది. చెప్పుకునేదాని ప్రకారం  పుష్ప రాజ్  తన సిండికేట్ చూసుకోవడం లో భాగంగా అడవుల్లోనూ, కొన్ని సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాలలోనూ స్మగ్లింగ్ డీల్స్ మాట్లాడుతూ తిరుగుతాడట. ఈ నేపథ్యంలో పోలీసులు పుష్పరాజ్ ని పట్టుకోవడం కోసం శ్రీవల్లి ని వాడుకుంటారని. ఆ క్రమంలో  ఆ  పాత్రని చనిపోతుందని తెలుస్తోంది. ఇక పుష్ప కి మూడవ భాగం తీసే ఆలోచన సుకుమార్  లేదని కానీ రెండవ భాగంలో శ్రీవల్లి పాత్ర మృతితో ఒక ఎమోషనల్ క్లైమాక్స్ ఉండబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే.... కేజీఎప్ 2ని యాజటీజ్ సుకుమార్ ఫాలో అయినట్లు ఉంటుంది..కేజీఎఫ్ 2 లో హీరోయిన్ పాత్ర చనిపోతుంది.  సుకుమార్ అంత తెలివి తక్కువ వాడా...అలా అనిపించుకోవటానికి?
 
  ఇక   ‘పుష్ప ది రైజ్’ హిందీ మార్కెట్‌నీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్‌కి పాన్ ఇండియా మార్కెట్ ఏర్పడింది. పాన్ ఇండియా స్టార్‌గా అల్లు అర్జున్ తన ఇమేజ్‌ని మరింత బలోపేతం చేసుకునేందుకోసం.. ‘పుష్ప ది రూల్’ ఎంతగానో ఉపయోగపడనుంది. అయితే, ‘పుష్ప ది రూల్’కి అప్పుడే తొలి టార్గెట్ ఫిక్స్ అయిపోయినట్లు కనిపిస్తోంది. ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ హిందీ బెల్ట్‌లో తొలి రోజు 50 కోట్ల పైన వసూలు చేసిన విషయం విదితమే. మొత్తం 53 కోట్లను తొలి రోజు వసూలు చేసింది ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’. ఈ నేపథ్యంలో ‘పుష్ప ది రైజ్’ ముందుగా కొట్టాల్సింది ఈ 53 కోట్ల రికార్డునే అంటున్నారు ట్రేడ్ లో .
  
అయితే, ‘పుష్ప ది రూల్’ ఇంకా సెట్స్ మీదకే వెళ్ళలేదు. మారుతున్న బాక్సాఫీస్ సమీకరణాల నేపథ్యంలో దర్శకుడు సుకుమార్, నిర్మాణ సంస్థ మైత్రీ మేకర్స్, హీరో అల్లు అర్జున్.. అన్ని ఈక్వేషన్స్‌నీ పరిగణనలోకి తీసుకుని ‘పుష్ప ది రూల్’ తెరకెక్కించాల్సి వుంది. మరో ప్రక్క హిందీ మార్కెట్ మాత్రమే కాదు, తెలుగులో ‘ఆర్ఆర్ఆర్’ రికార్డుల్ని సైతం ‘పుష్ప ది రూల్’ టార్గెట్ చేయాల్సి వుంది. ‘పుష్ప’ సినిమాకి హీరోయిన్ రష్మిక మండన్న అదనపు అడ్వాంటేజ్. ఆమె కూడా ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios