Shiva Nirvana:‘టక్ జగదీష్’డైరక్టర్ నెక్ట్స్ ఫైనల్, హీరో విజయ్ దేవరకొండ కాదు
Nani హీరోగా నటించిన చిత్రమిది. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్స్. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయ్యింది. పెద్ద ప్లాఫ్ అయ్యింది. దాంతో వెంటనే మరో సినిమా యంగ్ హీరో విజయ్ దేవరకొండతో ప్రారంభం అవుతుందనుకుంటే కాలేదు.
‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి భావోద్వేగభరిత ప్రేమకథా చిత్రాలతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడు శివ నిర్వాణ. ఆ తర్వాత చేసిన ‘Tuck Jagadeesh’తో ఓ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రుచి చూపించాలనుకున్నారు. Nani హీరోగా నటించిన చిత్రమిది. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్స్. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లో విడుదల అయ్యింది. పెద్ద ప్లాఫ్ అయ్యింది. దాంతో వెంటనే మరో సినిమా యంగ్ హీరో విజయ్ దేవరకొండతో ప్రారంభం అవుతుందనుకుంటే కాలేదు. అయితే ఇప్పుడు మరో హీరోని ఒప్పించారని తెలిసింది. ఆ హీరో మరెవరో కాదు...వెంకటేష్.
లైగర్ తో విజయ్ దేవరకొండ బిజీగా ఉండటం, దానికి తోడు ప్యాన్ ఇండియా సినిమాల వైపే మ్రొగ్గు చూపటంతో ఈ దర్శకుడు వెంకటేష్ ని ఎప్రోచ్ అయ్యారని తెలుస్తోంది. కుటుంబ భావోద్వేగాలన్నింటినీ ప్రేక్షకులకు ఈ సినిమాతో మరోసారి చూపించేలా స్క్రిప్టు చేసారని తెలిస్తోంది. ఫ్యామిలీ డ్రామా చిత్రంగా, ఓ కొత్త పాయింట్ తో వెంకటేష్ ని మెప్పించారని తెలిస్తోంది. ఈ సినిమాలో చాలా కొత్త విషయాలు ఉన్నాయంటున్నారు. నిజ జీవితంలో చూసే ఎమోషన్స్‌ను వాస్తవికంగా ఈ కథలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
అలాగే ‘‘నిన్నుకోరి’లో ప్రేమికుల మధ్య.. ‘మజిలీ’లో భార్యాభర్తల మధ్య ఓ సంఘర్షణ ఉంటుంది. టక్ జగదీష్ లో అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య ఉండే గొడవలు, అసూయల నేపథ్యంలో ఓ సంఘర్షణ ఉంటుంది. ఇప్పుడు వెంకీకు చెప్పిన కథ లో కూడా అన్ని ఉంటాయంటున్నారు. వెంకీ పాత్రలో ఫన్.. పవర్.. ఎమోషన్స్.. ఇలా మూడు షేడ్స్ ఉంటాయి. పాటలు, ఫైట్స్ కథలో భాగంగానే ఉంటాయి తప్ప ఎక్కడా ఇరికించినట్లుగా ఉండవు’’ అని వినపడుతోంది.
ఇక వెంకీ సినిమాల విషయానికి వస్తే... ఓటీటీలో నారప్ప, దృశ్యం 2 చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న విక్టరీ వెంకటేష్ త్వరలోనే F3 మూవీతో సందడి చేయడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదల కావాల్సింది. కానీ కరోనా పరిస్థితుల కారణంగా సినిమాను మరింత వెనక్కి వెళుతుందని సినీ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్.