KGF 2: గనికి 'ఆర్.ఆర్.ఆర్' దెబ్బ, Jersy కి KGF 2?

నెక్ట్స్ వీక్ రిలీజ్ పెట్టుకున్న సినిమాలు ఈ సునామీలో కొట్టుకుపోతాయేమో అని భయంతో వణుకుతున్నాయి. రీసెంట్ గా ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అయ్యాక రిలీజైన తర్వాత వారం వచ్చిన సినిమాలు ఏమీ నిలబడలేదు. మినిమం వసూళ్లు కూడా సాధించలేదు.

Shahid Kapoor Jersey wants to postponed due to KGF 2?

బాక్సాఫీస్‌ మీద దండయాత్ర మొదలుపెట్టిన కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 కలెక్షన్ల సునామీని ఇప్పట్లో ఆపేదేలే అన్నట్లుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కన్నడ రాకింగ్‌ స్టార్‌ యశ్‌ హీరోగా, ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన కేజీఎఫ్‌ చాప్టర్‌ 2 సినిమాకు సౌత్‌ నుంచి నార్త్‌ దాకా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్షన్స్ వర్షం కురుస్తోంది. దాంతో నెక్ట్స్ వీక్ రిలీజ్ పెట్టుకున్న సినిమాలు ఈ సునామీలో కొట్టుకుపోతాయేమో అని భయంతో వణుకుతున్నాయి. రీసెంట్ గా ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అయ్యాక రిలీజైన తర్వాత వారం వచ్చిన సినిమాలు ఏమీ నిలబడలేదు. మినిమం వసూళ్లు కూడా సాధించలేదు.

అంతెందుకు వరుణ్ తేజ్ గని సినిమా ఎంతో ఎక్సపెక్టేషన్స్ తో రిలీజ్ చేస్తే పోస్టర్ ఖర్చులు కూడా రాని పరిస్దితి. అసలు ఆ సినిమా రిలీజైందని ఎవరూ ఆర్.ఆర్.ఆర్ వేడిలో పట్టించుకోలేదు. ఇప్పుడు కేజీఎఫ్ 2 కలెక్షన్ హోరులోనూ అదే పరిస్దితి ఎదురువుతుందని అంటున్నారు ట్రేడ్ జనం. ఏప్రిల్ 22న వస్తున్న Jersey హిందీ రీమేక్ పై ఆ ఇంపాక్ట్ పడే అవకాసం ఉందంటున్నారు. గని సినిమా స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా, జెర్సీ కూడా స్పోర్ట్స్ ఎమోషన్ డ్రామా అని పోల్చి చూపెడుతున్నారు. ప్రశాంతంగా రాఖీ భాయ్ ర్యాంపేజ్ తగ్గాక జెర్శీ రిలీజ్ చేస్తే బెస్ట్ అంటున్నారు. 
 
ఎందుకంటే కేజీఎఫ్ 2 సినిమా  కేవలం రెండు రోజులకే ఒక్క హిందీ వెర్షన్ నుంచే  100 కోట్లు రాబట్టింది. అంటే అక్కడ జనాలకి బాగానే పట్టింది. ఇదే పరిస్దితి కొనసాగితే మరో పది రోజులు ఇదే పరిస్దితి కొనసాగేటట్లు ఉంది.  దాంతో జెర్శీ ఇప్పుడ  వచ్చినా  రిస్క్ లో పడే అవకాసం ఉంది.   జెర్సీ  డేట్ మార్చుకుంటే బెస్ట్ అని డ్రేడ్ లో అంటున్నారు. మరి హీరో షాహిద్ కపూర్  ఏమంటారో మరి?
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios