Godse:'గాడ్సే' దెబ్బ... 'గుర్తుందా శీతాకాలం' కు గట్టిగా తగిలేటట్లుంది

 డిఫరెంట్‌ రోల్స్‌ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్‌ తాజాగా 'గాడ్సే'గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో సత్యదేవ్‌తో 'బ్లఫ్‌ మాస్టర్‌' సినిమా తెరకెక్కించిన గోపీ గణేష్‌ పట్టాభి ఈ మూవీకి దర్శకత్వం వహించారు.

Satya Dev Godse scores another dud


 సత్యదేవ్.. టాలెంటెడ్ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఒకవైపు హీరోగా చేస్తూనే మరోవైపు వేరే హీరో సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్‌ చేస్తున్నాడు.  తాజాగా ఈయన హీరోగా నటించిన సినిమా గాడ్సే. నిన్న శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది ట్రేడ్ లో ఆసక్తికరమైన విషయంగా మారింది.  గతంలో సత్యదేవ్‌తో 'బ్లఫ్‌ మాస్టర్‌' సినిమా తెరకెక్కించిన గోపీ గణేష్‌ పట్టాభి ఈ మూవీకి దర్శకత్వం వహించటం సినిమాకు క్రేజ్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి నటించింది. సీకే స్క్రీన్స్‌ బ్యానర్‌పై సి. కల్యాణ్‌ నిర్మించిన 'గాడ్సే'  సామాజిక అంశాలు, వ్యవస్థ తీరు వంటి తదితర విషయాలు కథాంశంగా తెరకెక్కింది.

అయితే గాడ్సే చిత్రం డిజాస్టర్ గా భాక్సాఫీస్ వద్ద నిలిచింది. ఓపినింగ్స్ కూడా రప్పిచుకోలేకపోయింది. ఈ సినిమాలో గాడ్సే పాత్రలో అద్భుతంగా నటించాడనే టాక్ వచ్చింది. ముఖ్యంగా యాక్షన్‌తో పాటు సెంటిమెంట్ సన్నివేశాలను పండించారని అందరూ మెచ్చుకున్నారు. అయితే సత్యదేవ్ కు ఇంకా పూర్తి గా జనాలను థియోటర్స్ రప్పించే శక్తి లేదని ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఈ సినిమాకు బాగా పూర్ రేటింగ్స్ వచ్చాయి. చాలా బోర్ సినిమా గా రివ్యూలు వచ్చాయి. ఈ సినిమా ఈ వీకెండ్ లో కూడా రన్ ఉండే అవకాసం లేదనిపిస్తోంది. 

ఇక ఇప్పటికే సత్యదేవ్, తమన్నా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుర్తుందా శీతాకాలం పూర్తైంది. అయితే ఆ సినిమాకు బయ్యర్లు కరువు అయ్యారు. ఈ సినిమా హిట్ అయితే దాన్ని ఒడ్డున పేడేయచ్చు అని నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. కానీ అది జరిగే పరిస్దితి కనపడటం లేదు. మరో ప్రక్క సత్యదేవ్..ఆచార్యలో నటించారు. ఆ సినిమా కూడా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు సత్యదేవ్ తన సినిమాల ఎంపిక విషయంలో ఆచి,తూచి అడుగులు వెయ్యాల్సిన పరిస్దితి ఏర్పడిందని చెప్పాలి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios