సుజీత్ నెక్స్ట్ మూవీ ఆ హీరోతోనేనా..?అదే బ్యానర్
యంగ్ డైరెక్టర్ సుజీత్ ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన 'సాహో' మూవీతో పాన్ ఇండియన్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరాడు. అయితే 'సాహో' తర్వాత మళ్ళీ సుజీత్ కొత్త ప్రాజెక్ట్ ఏదీ అనౌన్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం సుజీత్ నెక్స్ట్ మూవీ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లోనే ఉండబోతోందని సమాచారం.
సుజీత్ పేరు ప్రభాస్ తో సాహో చేసినప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ తర్వాత సాహో అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాకపోవటం కాస్త నిరాశపరిచింది. అయితేనేం సాహో ఎలా అయినా ఉండనీ.. ఇంత చిన్న వయసులో అలాంటి సినిమాను హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు అన్నారు. సినిమా పరంగా ఎలా ఉన్నా కూడా ఒకేసారి ఇంత భారీ బడ్జెట్ సినిమాకు ఒప్పించి.. 350 కోట్ల భారీ బడ్జెట్ లో సినిమా తీయడం అంటే చిన్న విషయం కాదని ఇండస్ట్రీ మెచ్చుకుంది. కానీ తర్వాత సినిమా మాత్రం ఇవ్వలేదు.
నిజానికి 'సాహో' తర్వాత మెగాస్టార్ చిరంజీవి లూసీఫర్ (Lucifer) రీమేక్ బాధ్యతలు ముందుగా ఈయనకే ఇచ్చారు. దీనిపై అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. చిరంజీవి స్వయంగా తన సినిమాను సుజీత్ తెరకెక్కించబోతున్నట్లు చెప్పాడు. అయితే కథ విషయంలో మార్పులు చేర్పులు చేయడంలో సుజీత్ విఫలం కావడంతో.. ఆయన్ని పక్కనబెట్టి మోహన్ రాజా (Mohan Raja)ను తెచ్చుకున్నాడు చిరంజీవి. దాంతో సుజీత్ మళ్లీ ఖాళీ అయిపోయాడు. అయితే ఈయనేం చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది.
Also read Varudu kaavalenu review: వరుడు కావలెను ట్విట్టర్ రివ్యూ
ఆ తర్వాత ఈ యంగ్ డైరెక్టర్ మళ్లీ ప్రభాస్ తోనే సినిమా చేయనున్నాడనే వార్తలు వస్తూనే ఉన్నాయి గానీ, ఏదీ అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ కాలేదు. ఇప్పుడున్న పరిస్దితుల్లో కష్టం కూడా. అయితే మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే...ప్రస్తుతం అయితే యూవీ వారి సంస్థలో ఓ ప్రాజెక్ట్‌కు ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ చేస్తున్నాడని సమాచారం. సుజీత్‌ను 'రన్ రాజా రన్' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం చేసింది, ఆ తర్వాత ప్రభాస్‌తో సుజీత్ డైరెక్షన్‌లో 'సాహో' నిర్మించింది ఈ బ్యానర్. కాగా ఇప్పుడు మూడవ సినిమా కూడా సుజీత్‌కు యూవీ వారే ఛాన్స్ ఇవ్వనున్నారని సమాచారం. అయితే హీరో ఎవరూ అంటే శర్వానంద్ అంటున్నారు.
Also read తన కన్నా చిన్నగా కనపడుతుందని పవన్ కళ్యాణ్ నో చెప్తారా?
శర్వానంద్, సుజీత్ కాంబినేషన్ లో వచ్చిన 'రన్ రాజా రన్' లాంటి ఫన్, చిన్న ట్విస్ట్ తో కూడిన సినిమా అంటున్నారు. ఈ సినిమాకు ఇప్పటికే స్క్రిప్టు పూర్తైందని చెప్తున్నారు. శర్వానంద్ కు కూడా వరస ఫ్లాఫ్ లు ఉన్నాయి. వీరి కాంబినేషన్ అయితే మళ్లీ క్రేజ్ వచ్చే అవకాసం ఉంది. కాకపోతే శర్వా వరస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. దాంతో శర్వా డేట్స్ సమస్య రాకపోతే ఈ ప్రాజెక్టు అతి త్వరలో పట్టాలు ఎక్కే అవకాసం ఉంది. త్వరలో దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.
సాహో తర్వాత సుజీత్త సినిమా ఏం చేస్తాడనే ఆసక్తి అందర్లోనూ కనిపిస్తుంది. ఈ విషయమై సుజీత్ ఆ మద్యన ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు. ‘సాహో’ లాంటి భారీ సినిమా మాత్రం చేయలేనని చెప్పేసాడు. మగధీర లాంటి భారీ చిత్రం తర్వాత మర్యాదరామన్న లాంటి చిన్న సినిమాతో రాజమౌళి వచ్చాడని.. తాను కూడా తక్కువ బడ్జెట్లో ఓ చిన్న సినిమా చేయడానికి ప్రయత్నిస్తానని సుజీత్ చెప్పాడు. అది ఎవరితో అనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదని చెప్పాడు. మరి ఆ చిన్న సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.