RRR:కొత్త రిలీజ్ డేట్... ఇదే ఫిక్స్ చేసారా?

 

 ఇక ఇదివరకూ కరోనా వల్లే పలు మార్లు వాయిదా పడిందీ చిత్రం. జనవరి 7న విడుదల చేయాలని దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించారు. ఇంకో ఆరు రోజుల్లో  సినిమాని చూస్తామనే ఆశతో ఎదురు చూస్తున్న అభిమానులకి నిరాశే మిగిలింది.

RRR makers to pick this as new release date


ఎప్పుడెప్పుడా అని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ మరోసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఒమిక్రాన్‌,   ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడటం, పరిమితులు విధించడంతో సినిమా విడుదలని వాయిదా వేసారు. ఆ మేరకు అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. తదుపరి ఎప్పుడు విడుదల చేస్తారనేది ప్రకటించలేదు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడు అనేది అంతటా చర్చనీయాంశంగా మారింది.

ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌’ కోసం తెలుగు ప్రేక్షకులే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌‌ అంతా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.  ఈలోపు వీలైనంత ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు రాజమౌళి.  RRR చిత్రం ఏప్రియల్ చివరి వారం అంటే ఏప్రియల్ 29 లేదా మే మొదటి వారంలో అంటే మే 6 న  కానీ ఉండవచ్చని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు దర్శక,నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.  వేసవి సందర్భంగా సినిమాని విడుదల చేస్తారా? పరిస్థితులు అనుకూలిస్తే అంతకుముందే విడుదల చేస్తారా? అనేది చూడాలి.

 ఇక ఇదివరకూ కరోనా వల్లే పలు మార్లు వాయిదా పడిందీ చిత్రం. జనవరి 7న విడుదల చేయాలని దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించారు. ఇంకో ఆరు రోజుల్లో  సినిమాని చూస్తామనే ఆశతో ఎదురు చూస్తున్న అభిమానులకి నిరాశే మిగిలింది. కొత్త ఏడాది తొలి రోజే తప్పని పరిస్థితుల్లో సినిమాని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది చిత్ర టీమ్.

 ‘బాహుబలి’ సినిమాల తర్వాత స్టార్ డైరక్టర్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రమిది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌  హీరోలుగా నటించారు. డి.వి.వి.దానయ్య నిర్మాత. బాలీవుడ్‌ నటులు అజయ్‌ దేవగణ్‌, అలియాభట్‌ ముఖ్య పాత్రలు పోషించారు.డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌‌తో నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ వాయిదాతో సంక్రాంతి బరిలోకి కొత్త సినిమాలు దిగాయి.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios