ప్రస్తుతం కమర్షియల్ సినిమా అంటే అందులో ఐటెం సాంగ్ కంపల్సరీ అయిపోయింది. స్టార్ హీరోయిన్లను తీసుకొచ్చి మరీ ఐటెం సాంగ్స్ లో డాన్స్ చేయిస్తున్నారు. ఈ ఐటెం సాంగ్స్ కి మాస్ ఆడియన్స్ లో క్రేజ్ ఉండడంతో మేకర్లు కూడా వీటిపై ఆసక్తి చూపుతున్నారు.

రాబోయే కొరటాల శివ, మెగాస్టార్ సినిమాలో కూడా ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ 150 సినిమాలో 'రత్తాలు' సాంగ్ ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. అందులో చిరు, లక్ష్మీ రాయ్ ల స్టెప్పులు యూత్ ని ఊపేశాయి. చిరు 151లో అలాంటి అవకాశం లేకుండా పోయింది.

అతడు నన్ను రేప్ చేశాడు.. దర్శకుడి సెన్సేషనల్ కామెంట్స్!

ప్రస్తుతం మెగాస్టార్, కొరటాల సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. జనవరి నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇందులో ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనికోసం కొంతమంది హీరోయిన్లను అనుకున్నారు. అలా షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలో రెజీనా పేరు మొదట ఉందని తెలుస్తోంది.

మెగాస్టార్ పక్కన రెజీనా డాన్స్ అంటే ఎలా ఉంటుందోననే సందేహాలు కలుగుతున్నాయి. చిరు డాన్స్ మూమెంట్స్ కి తగ్గట్లుగా ఉండాలి. రెజీనా ఆ మేరకు సరిపోతుందా అనేది అనుమానం. అయితే రెజీనాని కన్సిడర్ చేయడానికి కొరటాలకి కొన్ని ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఆయన అంత ఈజీగా అయితే కాస్ట్ చేయరు. మరి కొరటాల ఏం ఆలోచిస్తున్నారో..? సినిమాలో చిరుకి జోడీగా మాత్రం త్రిషని తీసుకోబోతున్నారని అంటున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మని ఫైనల్ చేసినట్లు సమాచారం. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.