లైంగిక వేధింపులు, అత్యాచారాలు ఆడవాళ్లపైనే కాదు.. మగాళ్లపై కూడా జరుగుతుండడం హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా పాకిస్థాన్ కి చెందినఓ దర్శకుడు తనపై ఓ మగాడు అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పడం షాక్ కి గురి చేస్తోంది.

పాకిస్థాన్ కి చెందిన జంషెద్ మొహమూద్ అనే దర్శకుడు తనపై ఓ ప్రముఖ వార్తా పత్రికకు చెందిన సీఈఓ అత్యాచారం చేశాడని చెప్పి సంచలనం సృష్టించాడు. మొదట్లో ఆ వ్యక్తి పేరు బయట చెప్పడానికి భయపడినా.. ఆ తరువాత పేరు బయటకి చెప్పేశాడు.

'ఎంతైనా పవన్ రక్తం కదా..' మండిపడ్డ రేణుదేశాయ్!

ప్రముఖ పాకిస్థానీ వార్తా పత్రిక అయిన డాన్ సీఈఓ హమీద్ హరూన్ తనపై అఘాయిత్యానికి పాల్పడ్డ విషయాన్ని వెల్లడిస్తూ.. ధైర్యం ఉంటే ఈ వార్తని పత్రికలో ప్రచురించండి అంటూ సవాల్ విసిరాడు. తను మీటూ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని.. ఎందుకంటే న్యాయస్థానాల్లో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు.

 

మీడియాలోనే పవర్ ఫుల్ వ్యక్తి తనను దారుణంగా రేప్ చేశాడని.. ఈ విషయాన్ని తన స్నేహితులకు చెబితే అందరూ జోక్ గా తీసుకున్నారని తెలిపాడు. ఈ ఘటన జరిగిన 13 ఏళ్లు దాటుతుందని.. అప్పుడే ఎందుకు చెప్పలేదని.. తనను తాను శపించుకుంటున్నానని ఎమోషనల్ అయ్యారు.

ఈ ఘటనను మర్చిపోవడానికి థెరపిస్ట్ దగ్గరకి వెళ్లాల్సి వచ్చిందని.. కొన్ని నెలల పాటు పాకిస్థాన్ కి దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.