Ram:రామ్‌తో బోయపాటి కాంబో వెనక ఇన్ని లెక్కలున్నాయా? ఆశ్చర్యమే

 'అఖండ' సృష్టించిన సంచలనం కారణంగా మాంఛి ఉత్సాహంతో బోయపాటి మళ్లీ రంగంలోకి దిగిపోయాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై రామ్ హీరోగా ఆయన ఒక సినిమా చేయనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు నిజమేనంటూ అధికారికంగా ప్రకటించారు.  దర్శకుడిగా బోయపాటికి ఇది 10వ సినిమా అయితే, హీరోగా రామ్ కి ఇది 20వ సినిమా.

Reason behind Ram Pothineni and Boyapati Srinu film announcement

‘అఖండ’తో ఘన విజయాన్ని అందుకున్న బోయపాటి శ్రీను కొత్త సినిమా ఎవరితో చేస్తాడా అని అందరూ ఎదురుచూసారు. అల్లు అర్జున్ తో సినిమా  ఖరారు అవుతుందని అకున్నారు. అయితే పుష్ప 2 పూర్తయ్యే సరికి చాలా టైమ్ పడుతుందని, బోయపాటి  యంగ్ హీరో  రామ్‌ పోతినేనితో కలిసి సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. రామ్ తో బోయపాటి సినిమా ఏమిటి అని చాలా మంది కొట్టిపారేసారు. కానీ చివరకు అదే నిజమైంది. అయితే ఈ కాంబినేషన్ వెనక చాలా లెక్కలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ టాక్. ఏమిటా లెక్కలు అంటే...

‘అఖండ’వంటి హిట్ కొట్టినా వెంటనే బోయపాటికి డేట్స్ ఇచ్చే హీరో లేరు. అందరూ బిజీగా ఉన్నారు. బోయపాటితో చేద్దామనుకునే హీరోలతో ఆయన చేయరు. బోయపాటి చేద్దామనుకునే హీరోలు ప్రభాస్, పవన్, మహేష్ వంటివారు ఆయనతో చేయటం లేదు. దాంతో బోయపాటికి వేరే ఆప్షన్ కనపడలేదు. అందరు యంగ్ హీరోలు బిజీగా ఉన్నారు. వెంటనే బాలయ్యతో మళ్లీ చేయటం కుదరని పని. వినయ విధేయరామ తర్వాత రామ్ చరణ్ దగ్గరకు వెళ్లాలంటే కష్టం. మహేష్ ఇప్పటికి బోయపాటి అంటే ఆసక్తి చూపటం లేదు. ఆ యాక్షన్ మనవల్ల కాదనుకుంటున్నాడు. పవన్ తో సినిమా మెటీరియలైజ్ అవ్వటం లేదు. ఈ క్రమంలో అతనికి కనపడ్డ హీరో రామ్.

మరో ప్రక్క లవర్ బోయ్ గా సినిమాలు చేసిన రామ్ ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ తర్వాత రామ్ కూడా యాక్షన్ సినిమా లు చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగానే లింగుస్వామి సినిమా చేస్తున్నారు. అలాంటి కథలే వింటున్నారు. అలా పాలే కోరాడు..డాక్టర్ అదే పధ్యం చెప్పాడు అన్నట్లుగా...ఇద్దరు కాంబినేషన్ సెట్ అయ్యి ఎనౌన్స్ మెంట్ వచ్చింది. అయితే బోయపాటి ఈ సినిమాని పాన్‌ ఇండియా స్థాయిలో సినిమా  చేయనున్నారు.  శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ కలయికలో సినిమాని శుక్రవారం అధికారికంగా ప్రకటించాయి చిత్రటీమ్

  నిర్మాత మాట్లాడుతూ ‘‘మా సంస్థ నుంచి రానున్న మరో  ప్రతిష్టాత్మక చిత్రమిది. ప్రస్తుతం రామ్‌తో తెలుగు, తమిళ భాషల్లో  ‘ది వారియర్‌’ సినిమాని నిర్మిస్తున్నాం. ఆ తర్వాత రామ్‌ చేస్తున్న చిత్రమిదే. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందిస్తాం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. అది ఇప్పటికి కుదిరింది. భారీ స్థాయిలో, అత్యున్నత నిర్మాణ విలువలతో చిత్రం తెరకెక్కుతుంది. త్వరలోనే ఇతర వివరాల్ని వెల్లడిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: పవన్‌కుమార్‌.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios