Ram Charan: భారీ 'రీలాంచ్' కోసం రామ్ చరణ్ సన్నాహాలు? షాకింగ్ డిటేల్స్
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్.ఆర్.ఆర్ చిత్రం హిందీలో కూడా బాగా వర్కవుట్ అవటంతో రామ్ చరణ్ కు మళ్లీ అక్కడ మార్కెట్ పై ఆసక్తి కలిగిందని సమాచారం. గతంలో ఈ మెగా హీరో బాలీవుడ్ లో తుఫాన్ చిత్రంతో లాంచ్ అయ్యారు. అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.
రామ్ చరణ్ ఆల్రెడీ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో తెలుగులో దూసుకుపోతున్నారు. శంకర్ వంటి సౌత్ ఇండియా టాప్ డైరక్టర్ తో సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా చేసిన ఆర్.ఆర్.ఆర్ చిత్రం దుమ్ము రేపింది. అందులో రామరాజు పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇలాంటి పరిస్దితుల్లో ఆయన రీలాంచ్ అవసరం ఏముంది అంటారా...అయితే రామ్ చరణ్ రీలాంచ్ ప్లాన్ ఇక్కడ మన తెలుగు కోసం కాదు ..హిందీ కోసం అని.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్.ఆర్.ఆర్ చిత్రం హిందీలో కూడా బాగా వర్కవుట్ అవటంతో రామ్ చరణ్ కు మళ్లీ అక్కడ మార్కెట్ పై ఆసక్తి కలిగిందని సమాచారం. గతంలో ఈ మెగా హీరో బాలీవుడ్ లో తుఫాన్ చిత్రంతో లాంచ్ అయ్యారు. అయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఎక్సప్రెషన్ లేకుండా చేసుకుంటూ పోయే హీరోగా అక్కడ మీడియా రామ్ చరణ్ ని అభివర్ణించింది. అది మరిచిపోలేని దారుణ పరాభవ అనుభవం. దాంతో అప్పటినుంచి ఇప్పటిదాకా రామ్ చరణ్ మరో సారి డైరక్ట్ హిందీ సినిమా చేయలేదు. కానీ ఈ సారి చేయాలనకుంటున్నారట. అదీ సల్మాన్ అండతో అని తెలుస్తోంది.
సల్మాన్ తో ఈ మేరకు చిరంజివి, రామ్ చరణ్ చర్చించారని తెలుస్తోంది. హిందీ పరిశ్రమపై పూర్తి గ్రిప్ ఉన్న సల్మాన్ ..అక్కడ రీలాంచ్ చేద్దామని, ఈ సారి పెద్ద హిట్ కొడదామని హామీ ఇచ్చారట. అక్కడ మాస్ హీరోలు తక్కువ ఉన్నారు కాబట్టి ఆ బెల్ట్ ని కవర్ చేస్తూ హిందీలో ప్రవేశించవచ్చని చెప్పారట. దాంతో ఓ పక్కా మాస్ సినిమాతో హిందీలోకి రీలాంచ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారట. అయితే తెలుగు, హిందీ అని ప్లాన్ చేయకుండా కేవలం హిందీ సినిమా లాగే చేద్దామని, అక్కడ నేటివిటికి తగినట్లే,అక్కడ ఆర్టిస్ట్ లతోటే చేద్దామని చెప్పారట. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయట. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఈ ప్రాజెక్టు ఉండే అవకాసం ఉందంటున్నారు.
ఇక ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నప్పుడే ఆ సినిమా రేంజ్ ను ఎక్స్ పెక్ట్ చేసి,అందుకు తగ్గట్లే పాన్ ఇండియా మూవీస్ ను లైనప్ లో పెట్టాడు రామ్ చరణ్.ఇప్పటికే మాస్టర్ డైరెక్టర్ శంకర్ మేకింగ్ లో భారీ యాక్షన్ చిత్రం చేస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరితో మూవీ లైనప్ లో ఉంది.ఇప్పుడు వీటితో పాటు తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో మూవీ చేయాలనుకుంటున్నాడు చరణ్.