Rajinikanth: నాతో కామెడీ చెయ్యకు కష్టం,కూల్ వార్నింగ్
రజనీకాంత్ కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఉంటారు. ముఖ్యంగా తన సినిమాల నుంచి తన అభిమానులు ఏమి ఆశిస్తారో గమనిస్తూంటారు.
రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రానికి టైటిల్‌ను ప్రకటించింది చిత్ర టీమ్. 'తలైవా 169' అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రకటించిన ఈ ప్రాజెక్టుకు 'జైలర్' అనే పేరు ఖరారు చేసింది. ఈ మేరకు తాజాగా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ టైటిల్‌ను బట్టి రజినీ సినిమాలో జైలర్‌గా కనిపిస్తారని అర్థమవుతుంది. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. డైరక్టర్ నెల్సన్ కు డార్క్ హ్యూమర్ స్పెషలిస్ట్ గా పేరుంది. ఆయన గత చిత్రాలు నయనతార తో చేసిన కొక్కోకిల, విజయ్ తో చేసిన బీస్ట్ లు రెండు హ్యూమర్ కు ఎక్కువ ప్రయారిటి ఇచ్చాయి. దాంతో రజనీకాంత్ చిత్రం సైతం ఇలాంటి కామెడీతో రూపొందుతుందా అనే సందేహం అభిమానుల్లో కలుగుతోంది.
నెల్సన్ దిలీప్ తమిళ హీరో విజయ్‌తో కలిసి బీస్ట్ అనే సినిమాను తెరకెక్కించిన ఫ్లాప్‌ను మూటగట్టుకున్నాడు. దీంతో రజినీ ఫ్యాన్స్ తమ అభిమాన హీరోతో నెల్సన్ దిలీప్ ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తాడా అని ఆందోళన చెందుతున్నారు. అయితే.. ఇప్పుడు వారి ఆందోళనను దూరం చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. తమిళ సినీ వర్గాలు నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కామెడీని తక్కువ చేసి, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ కే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వమని రజనీ పురమాయించినట్లు తెలుస్తోంది. విజయ్ తో చేసిన బీస్ట్ సినిమా ప్లాఫ్ కు కారణం మోతాదు ఎక్కువైన కామెడీ అని తేల్చారు. విజయ్ కు చెందిన ఎలిమెంట్స్ లేకపోవటం దెబ్బ తీసింది. బీస్ట్ లో కామెడీ బాగా ట్రోలింగ్ కు గురి అయ్యింది. దాంతో ఈ చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ సినిమా కోసం మరో స్టార్ డైరెక్టర్ కూడా ఈ సినిమాలో జాయిన్ అయిన్నట్లు తెలుస్తోంది. తమిళ స్టార్ డైరెక్టర్ కెఎస్.రవికుమార్ గతంలో రజినీకాంత్‌కు ముత్తు, నరసింహా, లింగా వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన విషయం తెలిసిందే. అయితే ఈసారి ఎలాగైనా మరో అద్భుతమైన సక్సెస్‌ను అందించాలని తలైవా స్వయంగా రవికుమార్‌ను ఈ సినిమా కోసం పనిచేయాల్సిందిగా కోరారట. ఇక ఈ సినిమాలో నెల్సన్ దిలీప్‌కు స్క్రిప్టు పనుల్లో రవికుమార్ సహాయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి రవికుమార్ ఈ సినిమాకు ఎలాంటి సక్సెస్‌ను అందించగలడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట చేయాల్సిందే. ఇక ఈ సినిమాను అతి త్వరలో పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న 'జైలర్' చిత్రంలో రజనీకాంత్‌కు జోడీగా ఐశ్వర్యరారు నటించనున్నట్టు తెలుస్తోంది. హీరోయిన్, ఇతర తారాగణం వివరాలు వెల్లడించాల్సి వుంది. జులై నుంచి 'జైలర్' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీత దర్శకుడు. హీరోయిన్‌గా ఐశ్వర్యరాయ్ బచ్చన్‌ను అనుకుంటున్నారు. ఈ చిత్రం జూలైలో సెట్స్‌పైకి వెళ్ళనుంది.