Pooja Hegde: పూజా హెగ్డేకు చేదు అనుభవం, బిల్ కట్టనంటూ నిర్మాత షాక్?!
ఇటీవల పూజ హెగ్డే నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ సినిమాలు వరుసగా ప్లాఫ్ అయ్యాయి.
ముకుంద సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది పూజా హెగ్డే. అతి తక్కువ సమయంలోనే తెలుగు లో స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అందం, అభినయంతో అభిమానుల్ని ఆకట్టుకున్నప్పటికీ ఈమె నటించిన సినిమాలు మాత్రం ఎక్కువగా ప్లాప్ అయ్యాయి. అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురం సినిమా లో నటించిన పూజ ఆ సినిమా ద్వారా మంచి విజయం అందుకుంది. ఆ ఊపులో తెలుగు హిందీ తమిళ భాషలలో స్టార్ హీరోలతో సినిమాలు చేసింది .
అయితే ఇటీవల పూజ హెగ్డే నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ సినిమాలు వరుసగా ప్లాఫ్ అయ్యాయి. ఈ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి పూజా హెగ్డే కారణమని, దీంతో ఈమెను ఐరన్ లెగ్ అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆమెకు రీసెంట్ గా ఓ బడా నిర్మాత నుంచి ఓ చేదు అనుభవం ఎదురైనట్లు సమాచారం.
తమిళ హీరో విజయ్ సరసన పూజా హెగ్డే నటించిన బీస్ట్ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే ఆ బిల్ లు ఇంకా సెటిల్ కాలేదట. ఆ చిత్రం షూటింగ్ సమయంలో పూజా హెగ్డే తన స్టాఫ్ ఖర్చులు భారీగా వచ్చాయి. కేవలం వీరి ఫుడ్ కోసమే లక్షలలో బిల్లు అయిందని తెలుస్తోంది. అధిక నష్టాల్లో కూరుకుపోయిన నిర్మాతలకు పూజా హెగ్డే కు చెందిన ఈ ఖర్చులు మరింత భారం అయ్యాయి.
ఈ క్రమంలోనే పూజా హెగ్డే తన స్టాఫ్ కోసం అయిన ఖర్చులను తానే భరించుకోవాలని నిర్మాతలు తనకు బిల్ పంపినట్లు తమిళ సినీ వర్గాల సమాచారం. హిట్ అయ్యి ఉంటే వేరే విధంగా ఉండేది కానీ ఫ్లాఫ్ అవటంతో ఆమె కూడా ఏమనాలో అర్దం కాని సిట్యువేషన్ కు చేరుకుందిట. తానే బిల్ కట్టాలని నిర్ణయించుకుందిట.
అంత మాత్రానికి ఆమె వెనకబడిపోయినట్లు కాదు. పూజా హెగ్డే కెరీర్లో వరుసగా మూడు ఫ్లాప్ సినిమాలు వచ్చినప్పటికీ ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె విజయ్ దేవరకొండ సరసన జనగణమన, మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు.